Hot Water: వేడి నీళ్లతో స్నానం చేస్తే ఓవర్‌ వెయిట్‌ తగ్గిపోతారా? నివేదికలో షాకింగ్‌ నిజాలు..‌

Weight Loss With Hot Water Bath: స్నానం చేయడం మన దైనందిత జీవితంలో భాగం. అయితే, స్నానం చేస్తే కూడా బరువు ఈజీగా తగ్గిపోతారు అంటే నమ్ముతారా? అవును.. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల వెయిట్‌ లాస్‌ అవుతారని షాకింగ్‌ అధ్యయనం వెల్లడించింది. మన శరీరంపై ఉండే వ్యర్థాలను తొలగించుకుంటే అధిక బరువు కూడా చెక్‌ పెట్టొచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.
 

1 /5

వేడినీళ్లతో స్నానం చేస్తే సరైన నిద్ర పడుతుంది. స్ట్రెస్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఒళ్లు నొప్పుల నుంచి కూడా బయటపడతారు. అయితే, వెయిట్‌ తగ్గాలనుకునేవారు కూడా ఎలాంటి వ్యాయామాలు చేయకుండానే ఓవర్‌ వెయిట్‌ తగ్గవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి.  

2 /5

ఓ పరిశోధనలో 14 మందిపై ఈ రీసెర్చ్‌ చేశారు. ఒక గంటపాటు వేడి నీళ్ల స్నానం చేస్తే అరగంట పాటు వాకింగ్‌కు సమానం అని తేలింది. గంట పాటు వేడి నీళ్ల స్నానం చేసినవారిలో 140 కేలరీలు తగ్గినట్లు తెలుస్తోంది. వేడినీళ్ల స్నానం చేస్తే మీ గుండె స్పీడ్‌ పెరుగుతుంది. దీంతో మీ కేలరీలు కూడా త్వరగా కరిగిపోతాయి. ఇలా తరచూ చేయడం వల్ల క్రమేణా బరువు సులభంగా తగ్గిపోతారు  

3 /5

వేడి నీళ్ల స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నాడి వ్యవస్థ కూడా రిలాక్స్ అవుతుంది. కండరాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. స్నానం చేసినప్పుడు కాళ్లు, చేతులు ఊపుతూ స్నానం చేయడం వల్ల త్వరగా కండరాల నొప్పి తగ్గుముఖం పడుతుంది.  

4 /5

వేడి నీళ్ల స్నానం చేయడం వల్ల కంటి నుంచి మెదడుకు కూడా ఉపశమనం లభిస్తుంది. డిప్రెషన్‌ తో బాధపడుతున్నవారు కూడా వేడి నీళ్లతో స్నానం చేయాలి. ఇది ప్రాణాంతక వ్యాధి నుంచి కాపాడుతుంది. మన శరీర అవయవ భాగాల్లో ఇన్ఫెక్షన్‌ నివారిస్తుంది.   

5 /5

హార్ట్‌ అటాక్..  వేడి నీటి స్నానం చేయడం వల్ల శరీరానికి ఉపశమనం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది. బ్లడ్‌ ప్రెజర్‌ స్థాయిలు తగ్గిపోతాయి కాబట్టి హార్ట్‌ ఫెయిల్యూర్‌ అవ్వకుండా ఉంటుంది.