Hardik Pandya Bowling: హార్దిక్‌ పాండ్యాకు ఏమైంది? విడాకుల నుంచి ఇంకా కోలుకోలేదా?

What Happened To Hardik Pandya Bowling Performance Fails In Sri Lanka T20 Series: శ్రీలంకతో ప్రారంభమైన టీ20 సిరీస్‌లో భారత జట్టు సీనియర్‌ ఆటగాడు హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో హార్దిక్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ ప్రదర్శన చెత్తగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ కారణాలు ఇవేనని తెలుస్తున్నాయి.

1 /6

Hardik Pandya: భారత టీ20 జట్టు‌కి కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా అవుతారని అందరూ భావించగా అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌కు సారథ్య బాధ్యతలు దక్కాయి. దీంతో హార్దిక్ పాండ్యాకు మరోసారి జట్టులో ఇబ్బందికర వాతావరణం ఎదురైంది.

2 /6

Hardik Pandya: కెప్టెన్సీ దక్కకున్నా సూర్య, హార్దిక్‌ మధ్య భేదాభిప్రాయాలు రాలేదని శ్రీలంకలో విమానం దిగినప్పుడు వారిద్దరూ కౌగిలించుకోవడం కనిపిస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను హార్దిక్ పాండ్యా కౌగిలించుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం దెబ్బతినకుండా ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

3 /6

Hardik Pandya: టీ20 ప్రపంచకప్‌లో మెరిసిన హార్దిక్‌ పాండ్యా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమవడంతో విమర్శలు వస్తున్నాయి. సూర్యకుమార్‌ యాదవ్‌ పిలిచి బంతి వేయమని చెప్పడంతో హార్దిక్‌ బంతి అందుకున్నాడు. అయితే ఆ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా మొత్తం 10 బంతులు వేసి షాక్‌కు గురయ్యాడు.

4 /6

Hardik Pandya: తొలి బంతికి ఒక పరుగు, తర్వాతి 2 బంతులు వైడ్‌లయ్యాయి. ఆ తర్వాత మళ్లీ 2వ బంతికి ఒక పరుగు జోడించినప్పుడు 3వ బంతి మళ్లీ వైడ్‌గా మారింది. ఆపై 3వ బంతికి కుశాల్ పెరీరా సిక్సర్ బాదగా, 4వ బంతి మళ్లీ వైడ్‌గా మారింది. దీంతో స్టేడియంలోని భారత అభిమానులు టెన్షన్‌పడ్డారు. తర్వాత 3 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా 10 బంతులు వేసి మొత్తం 15 పరుగులు ఇచ్చాడు.

5 /6

Hardik Pandya: ఒక ఓవర్‌లో పది బంతులు వేయడం హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. అయితే సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ ఇవ్వడంతోనే హార్దిక్ పాండ్యా ఇలా బంతులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

6 /6

Hardik Pandya: కెప్టెన్సీ కాదు తన భార్యతో విడాకులు తీసుకున్న కారణంగా మానసికంగా ఇంకా హార్దిక్‌ కోలుకోలేదని తెలుస్తోంది. మానసిక పరిస్థితి బాగాలేకపోవడంతోనే హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో తడబడుతున్నట్లు తెలుస్తోంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x