Kanwar Yatra 2024: కన్వర్ యాత్ర అంటే ఏమిటి..?.. ఎందుకు చేస్తారు.. భక్తులు పాటించాల్సిన నియమాలు ఇవే..


Kanwar yatra tradition: కన్వర్ యాత్రను శివభక్తులు ఆచరిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసం ప్రారంభంనుంచి పదిహేను రోజుల పాటు ఈ యాత్ర ను నిర్వహిస్తారు. ఈ ఏడాది జులై 22 నుంచి ఆగస్టు 3 వరకు ఈ యాత్ర సాగనుంది.

1 /6

కన్వర్ యాత్రను శివభక్తులు ఆచరిస్తారు.ఈ యాత్రలో ముఖ్యంగా శివభక్తులు దేశవ్యాప్తంగా కాషాయ దుస్తులు ధరిస్తారు. శ్రావణమాసంలో మొదటి రోజు నుంచి పదిహేను రోజుల పాటు ఈ యాత్ర చేపడతారు. ఈయాత్రంలో ముఖ్యంగా భక్తుల వెదురుతో శివుడి కోసం పల్లకిలు, తొట్లేల మాదిరిగా పల్లకీలు చేసుకుంటారు. దీనిలో శివుడి ఫోటోపెట్టుకుని యాత్ర చేస్తారు.  

2 /6

ప్రసిధ్ది చెందిన గంగాస్థానాలకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత గంగా నదీ నుంచి జలాన్ని తీసుకుని శివుడికి అభిషేకం చేస్తుంటారు. ఇలా చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతుంటారు. ప్రతి ఏడాది ఈ పవిత్రమైన యాత్ర జరుగుతుంది.   

3 /6

 ఉత్తరాది వైపు ఉన్న భక్తులు ఈ కన్వర్ యాత్రను ఎక్కువగా చేస్తుంటారు. శ్రావణం అంటే శివుడికి ఇష్టమైన మాసంగా చెబుతుంటారు. ఈ మాసంలో శివుడికి గంగాజలాన్ని సమర్పించడం వల్ల ప్రసన్నుడు అవుతాడని నమ్ముతారు. శివ భక్తులు భగవంతుడి అనుగ్రహం పొందటం కోసం ఈ మాసంలో కన్వర్ యాత్రను నిర్వహిస్తారు. రాముడు, పరశురాముడు, రావణుడితో సహ ఎంతో మంది కన్వర్ యాత్ర చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

4 /6

ముఖ్యంగా.. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్, గౌముఖ, గంగోత్రి వంటి ప్రాంతాల నుంచి గంగా జలాన్ని తీసుకువస్తారు. శివనామ స్మరణ చేసుకుంటూ కాలినడకన ఈ యాత్ర సాగిస్తారు. ఇలా కన్వర్ యాత్ర చేస్తే అన్ని కోరికలు నెరవేరతాయని నమ్ముతారు. ఈ ఏడాది జులై 22 న ప్రారంభమై ఆగస్ట్ 3న ముగుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కన్వర్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు  కూడా తీసుకున్నారు. 

5 /6

కన్వర్ యాత్ర చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటిస్తారు. కన్వర్ యాత్ర నాలుగు రకాలుగా ఉంటుంది. సాధారణ కన్వర్ ,డక్ కన్వార్, దండి కన్వార్,స్టాండింగ్ కన్వార్ అనిఉంటారు. వీరంతా శివుడిని స్మరించుకుంటూ పాదయాత్రగా వెళ్తుంటారు. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు కాషాయ రంగు వస్త్రాలు ధరిస్తారు. కావిడితో తీసుకొచ్చిన గంగా జలాన్ని శివలింగానికి సమర్పించడం వల్ల తమ కోరికలు తప్పకుండా నెరవేరతాయని భక్తుల విశ్వాసం.

6 /6

కన్వర్ యాత్రలో పాల్గొనే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ సమయంలో మద్యం, గుట్కా, పాన్ లు, పొగాకు, సిగరెట్లు వంటివి అస్సలు ముట్టుకోవద్దు. భక్తి, విశ్వాసంతో దేవుడి మీద మనసు పెట్టి ఈ యాత్ర చేపట్టాలి. మనసులో కేవలం భగవంతుడి నామం స్మరించుకుంటూ ఈ యాత్రను నిర్వహించాలి. ఇలా చేస్తే ఆ భోలేనాథుడి ఆశీర్వాదాలు ఉంటాయని చెబుతుంటారు.