Shobitha Shivanna: ఆత్మహత్య చేసుకున్న శోభిత ఎవరు..? జీవితంలో ఊహించని ట్విస్టులు

Shobitha suicide reason : కన్నడ సినీ పరిశ్రమలో ప్రసిద్ధి పొందిన.. శోభిత శివన్న ఇటీవల తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాదకర ఘటన.. తెలంగాణలోని కొండాపూర్‌లో చోటుచేసుకుంది. శోభిత శివన్న మరణ వార్త సినీ ప్రేమికులను విషాదంలో ముంచెత్తింది.  
 

1 /5

శోభిత శివన్న 1992 సెప్టెంబర్ 23న.. బెంగళూరులో జన్మించారు. చిన్ననాటి నుండి కళలు, వినోదంలో ఆసక్తి కనబరచిన ఆమె, బాల్డ్విన్ గర్ల్స్ హైస్కూల్‌లో చదివారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఎంతో ఇష్టం కలిగిన ఆమె.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) లో ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకున్నారు.  

2 /5

2015లో విడుదలైన కన్నడ చిత్రం రంగీ తరంగ ద్వారా ఆమె సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆమె నటించిన ఇతర ప్రముఖ చిత్రాలు.. ఒంద్ కథే హెల్లా, ఎరడొండ్ల మూరు, వందన, ATM అటెంప్ట్ టు మర్డర్, జాక్‌పాట్ వంటి సినిమాలో నటించింది. అలాగే, గాలిపట, కోగిలె, మంగళగౌరి, బ్రహ్మగంటు, కృష్ణ రుక్మిణి వంటి సీరియల్స్ ద్వారా టీవీ ప్రేక్షకులను అలరించారు.  

3 /5

ANI నివేదిక ప్రకారం, శోభిత శివన్న తన కొండాపూర్ నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయింది. కేసు దర్యాప్తులో ఉంది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం పంపారు.  

4 /5

వ్యక్తిగత జీవితం   మీడియా కథనాల ప్రకారం, ఆమె గత ఏడాది వివాహం చేసుకున్న తర్వాత సినిమాల నుండి దూరమయ్యారు. ఆమె భర్త సుధీర్‌తో కలిసి కొండాపూర్‌లో నివసిస్తున్నారు.  

5 /5

ఆత్మహత్యకు గల కారణం   ఆమె ఆత్మహత్య వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసును పరిశీలిస్తున్నారు.