Salary Limit: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్, ఉద్యోగుల జీతభత్యాల పరిమితి పెరగనుంది. ఏకంగా జీతభత్యాలు రెట్టింపు కానున్నాయి. కనీస వేతనం 15 వేల నుంచి 30 వేలు కావచ్చని అంచనా. ఎవరెవరికి ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం.
ప్రస్తుతం 15 వేల జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటా నెలకు 18 వందలుంది. ఇప్పుడు జీతం పరిమితి 30 వేలకు పెరిగితే పీఎఫ్ వాటా 3600 కానుంది.
ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో 7 కోట్లమంది సభ్యులున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కనీస పరిమితి 15 వేలుంది. గతంలో ఇది 6500 ఉండేది. ఈపీఎఫ్ ఎక్కౌంట్ ఉంటే ఉద్యోగి, యజమాని నుంచి పీఎఫ్ ఎక్కౌంట్లో డబ్బులు జమ అవుతాయి.
ఉద్యోగుల జీతభత్యాల పరిమితి పెంచే విషయం ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో చర్చించారు. దీనిపై తుది నిర్ణయం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నెలకు 15 వేలకంటే ఎక్కువ కనీస వేతనం ఉంటే ఈపీఎఫ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇప్పుడీ పరిమితి 15 వేలు పెరిగితే ఈపీఎఫ్ సభ్యులు కూడా పెరుగుతారు.
ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో చేరేవారికి కనీస వేతనం 15 వేలు, ఈఎస్ఐసీ ఉద్యోగులకు 21 వేలు ఉంది. ఇప్పుడీ పరిమితి కాస్తా రెట్టింపు అంటే 30 వేలు కావచ్చని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఉద్యోగులు, ఈఎస్ఐసీ పరిధిలో ఉద్యోగుల జీతాల పరిమితి భారీగా పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఉద్యోగుల జీతాల లిమిట్ రెట్టింపు కానుంది. ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ , స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల కనీస వేతనం రెట్టింపు కానుంది.