Top Bridges: వంతెన అనేది రెండు ప్రాంతాల్ని కలపడమే కాకుండా రవాణా వ్యవస్థ, ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఒకదానిని మించి మరొకటిగా వంతెనలు చాలానే ఉన్నాయి. కానీ కొన్ని వంతెనలు చాలా ప్రత్యేకం. ఇవి మూవింగ్ బ్రిడ్జీలు. అంటే కదిలే వంతెనలు.
పంబన్ బ్రిడ్జి, రామేశ్వరం పంబన్ బ్రిడ్జి అనేది తమిళనాడులోని రామేశ్వరం ద్వీపాన్ని భారత భూభాగంతో రైలు మార్గం ద్వారా కలిపే వంతెన. ఈ వంతెన నిర్మాణం 1915లో జరిగింది. సముద్రం మధ్యలో నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతానికి ఉదాహరణ. భారీ పడవలు, ఓడలు వెళ్లేటప్పుడు మధ్యలో రెండుగా చీలుతుంది.
పోంట్ జాక్వెస్ చబన్ డెల్మాస్ బ్రిడ్జి ఇదొక వెర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి. ఫ్రాన్స్‌లోని బోర్డిక్స్ నగరంలో ఉంది. ఈ వంతెన గెరోన్ నదిపై ఉంది. 2013లో ప్రారంభమైంది.
టవర్ బ్రిడ్జి, లండన్ ఇంగ్లండ్ రాజధాని లండన్‌కు ల్యాండ్ మార్క్, గుర్తింపుగా ఉన్నది టవర్ బ్రిడ్జి. థేమ్స్ నదిపై నిర్మించిన వెంతెన ఇది. 1886 నుంచి 1894 మధ్యలో నిర్మించారు. బోట్స్ , షిప్స్‌కు దారివ్వాలంటే వంతెనపై ట్రాఫిక్ అగుతుంది. ఆ తరువాత వంతెనలో ఓ భాగం రెండుగా చీలి ఆ పడవలకు దారిస్తుంది.
హార్న్ బ్రిడ్జి, జర్మనీ జర్మనీలోని కీల్ నగరంలో ఉన్న హార్న్ బ్రిడ్జి చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మూడు విభాగాలుగా అంటే ఎన్ ఆకారంలో తెర్చుకుంటుంది. 1997లో నిర్మించిన వంతెన ఇది. ఈ వంతెన కింద నుంచి మిడ్ సైజ్ ఓడ ప్రయాణించగలదు
ఫోరిడ్ హార్బర్ బ్రిడ్జి వేల్స్లో ఉన్న ఫోరిడ్ హార్బర్ వంతెనను సైకిల్ యాత్రికులు, పాదచారుల కోసం ప్రారంభించారు. డ్రాగన్ బ్రిడ్జి అని కూడా పిలుస్తారు. ఇది వి ఆకారంలో తెర్చుకుంటుంది.