Yadamma Raju: ఎంతో మంది కమెడియన్స్ ను పరిచయం చేసింది జబర్దస్త్ ప్రోగ్రామ్. వారిలో యాదమ్మ రాజు కూడా ఉన్నారు. యాదమ్మ రాజు కామెడీ అందరికీ తెలిసిందే. ఈమధ్యే ఆయన తండ్రిగా ప్రమోషన్ పొందారు. అతని భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ గారాల పట్టికి పేరు పెడుతూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు.
Yadamma Raju: యాదమ్మ రాజు, స్టెల్లాది లవ్ మ్యారేజ్. రెండేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు.
తాజాగా తమ గారాలపట్టి గురించి యాదమ్మ రాజు, స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు.
8 ఏళ్ల ప్రేమ ప్రయాణం, 2 ఏళ్ల భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక మన కూతురు. మొన్నటి వరకు మేం కేవలం భార్యభర్తలం మాత్రం ఇప్పుడు తల్లిదండ్రులం అయ్యాం.
మేము మొదట్నుంచి కూతురే పుట్టాలని అనుకున్నాం. ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు. మా పాప మా బంగారు తల్లి..ఇప్పుడు ఆమెనే మా సర్వస్వం అంటూ పోస్టు చేశారు.
ఈ బిడ్డ మాకు దేవుడు ఇచ్చిన కానుక కాబట్టి తనకు గిఫ్టీ అని నిక్ నేమ్ పెట్టాము అంటూ ఈ పోస్టులో చెప్పుకొచ్చారు.
యాదమ్మ రాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, సినీ అభిమానులు, నెటిజన్లు యాదమ్మరాజు దంపతులకు విషేస్ చెబుతున్నారు.
అయితే ఈ ఫొటోల్లో తమ కూతురు ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.