Spiderman Folk Dance: స్పైడర్ మ్యాన్ ఫోక్ డాన్స్ వీడియో చూశారా?

Funny Video:  స్పైడర్‌మ్యాన్ ఫోక్ డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2022, 02:23 PM IST
Spiderman Folk Dance: స్పైడర్ మ్యాన్ ఫోక్ డాన్స్ వీడియో చూశారా?

Spiderman Folk Dance Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని జంతువులకు సంబంధించినవి అయితే, మరికొన్ని మనుషులకు సంబంధించినవి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. మనకందరికీ  స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ వంటి హీరోలు గురించి తెలుసు. తాజాగా స్పైడర్ మ్యాన్ ఫోక్ డ్యాన్స్ చేసిన వీడియో (Spiderman Folk Dance Video) నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అది కూడా మనదేశంలో. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి. 

వీడియో ఓపెన్ చేస్తే... భారత్ లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని (West bengal) ఓ మార్కెట్‌ప్లేస్‌లో కొంత మంది మహళలు జానపద నృత్యం చేస్తూ ఉంటారు. ఇంతలో ఓ వ్యక్తి స్పైడర్‌మ్యాన్ దుస్తులు ధరించి అక్కడికి వస్తాడు. అక్కడ బెంగాలీ మహిళలు వారి ఫోక్ డ్యాన్స్ అయిన 'షోతాల్ నాచ్' ప్రదర్శిస్తుంటారు. ఇద్దరు వ్యక్తులు వాయిద్యాలపై సంగీతాన్ని వాయిస్తారు. వారితోపాటే కాలు కదిపాడు స్పైడర్ మ్యాన్. ఆ స్త్రీలు చేసే డ్యాన్స్ కు భిన్నంగా తన సొంత స్టెప్పులను వేస్తాడు. ఈ మార్వెల్ హీరో వేసిన స్టెప్పులకు నెటిజన్ల ఫిదా అయిపోయారు. ఈ వీడియో ‘kolkatas.illusion’ అనే ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేయబడింది. కొద్ది గంటల్లోనే ఈ వీడియో మిలియన్స్ వ్యూస్ సంపాదించింది. 

Also Read: king cobra kissing video: బాప్ రే.. ఈ అమ్మాయి కింగ్ కోబ్రాకే కిస్ ఇచ్చింది, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News