king cobra kissing video: బాప్ రే.. ఈ అమ్మాయి కింగ్ కోబ్రాకే కిస్ ఇచ్చింది, వీడియో వైరల్

Viral Video today: ఓ అమ్మాయి కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2022, 04:31 PM IST
  • ప్రపంచంలో భయంకరమైన పాము కింగ్ కోబ్రా
  • కింగ్ కోబ్రా ముద్దుపెట్టిన యువతి
  • వైరల్ అవుతున్న వీడియో
king cobra kissing video: బాప్ రే.. ఈ అమ్మాయి కింగ్  కోబ్రాకే కిస్ ఇచ్చింది, వీడియో వైరల్

Snake Video viral: సోషల్ మీడియాలో (Social Media) పాములకు సంబంధించిన ఎన్నో వీడియోలు రోజూ వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనల్ని భయపెడితే.. మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. సాధారణంగా పాములంటే అందరూ భయపడతాం. కొంతమంది మాత్రం ఎటువంటి భయం లేకుండా వాటితో ఆడుకుంటూ ఉంటారు. వారు విషపూరితమైన పాములైనా సరే లెక్క చేయరు. 

ఈ భూమిపైనే అతిపెద్ద భయంకరమైన పాము కింగ్ కోబ్రా (king cobra). ఇది కాటు వేసిందంటే ఆ వ్యక్తి క్షణాల్లోనే మరణిస్తాడు. అలాంటి పాముకు ఓ యువతి స్టేజ్ పై ముద్దుపెట్టి ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

వీడియో ఓపెన్ చేస్తే.. ఓ అమ్మాయి ఒక వేదికపై కింగ్ కోబ్రాను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ముందుగా ఆ యువతి చేతితో నల్లగుడ్డని తీసుకుని.. పాము దృష్టిని దానిపై వెళ్లేలా చేస్తుంది. ఆ తర్వాత కోబ్రాకు ముద్దు పెడుతుంది. ఆమెకు పాము ఎటువంటి హాని చేయదు. చుట్టుపక్కల ఉన్నవారు ఆమె చేసిన సాహాసానికి చప్పట్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో world_of_snakes అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో అప్ లోడ్ చేయబడింది. కొద్ది గంటల్లోనే ఈ వీడియో మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఈ వీడియో పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: Tricolor Waterfall: అది మువ్వన్నెల జండా కాదు..మూడు రంగుల జలపాతం, వైరల్ అవుతున్న వీడియో 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News