One Euro Houses: అక్కడ రూ.90 లకే సొంతిల్లు..కండిషన్స్ అప్లై..

ఓ పట్టణంలోని ఇళ్లను కేవలం రూ.90 లకే అమ్మడానికి సిద్దమైంది అక్కడి సర్కార్. ఇది నమ్మశక్యంగా లేకపోయినా నిజమే.!  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2021, 01:24 PM IST
One Euro Houses: అక్కడ రూ.90 లకే సొంతిల్లు..కండిషన్స్ అప్లై..

Cheap Houses in Italy: ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు(Own houses) ఉండాలని కోరుకుంటారు. అయితే ప్రస్తుతం సంపాదన తక్కువ.. ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతివారికి ఇల్లు అనేది తీరని కోరికగా మిగిలిపోతుంది. ముఖ్యంగా బతుకుదెరువు కోసం గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. అయితే మళ్ళీ తమ ప్రాంతం ప్రజలతో కళకళ్లాడాలని కొన్ని ప్రభుత్వాలు వినూత్నంగా ప్రణాళిక రచిస్తున్నాయి. ఓ పట్టణంలోని ఇళ్లను కేవలం రూ.90 లకే అమ్మడానికి సిద్దమైంది అక్కడి సర్కార్. ఇది నమ్మశక్యంగా లేకపోయినా నిజమే.

వివరాలోకి వెళ్తే..
ఇటలీ దేశం(Italy)లోని కాస్టిగ్లియోన్ డీసీసీలియా వద్ద సిసిలియన్(Sicilia) పట్టణంలో అతి తక్కువ ధరకు ఇళ్లను అమ్మకానికి  పెట్టింది అక్కడ ప్రభుత్వం. కాస్టిగ్లియోన్ డి సీసీలియా(Castiglione Di Sicilia) ప్రకృతి అందాలతో అలరారుతూ..పర్యాటకులను ఆకర్షిస్తుంది . ఏటవాలు పర్వతం.. సముద్ర తీరం వంటి వాటితో సుందరంగా ఉంటుంది ఈ గ్రామం. ఇక్కడ సుమారు 900 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో చాలావరకూ శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అధికారులు  రంగంలోకి దిగి.. శిధిలావస్థలో ఉన్న ఈ ఇళ్లను 1 యూరోకి(భారత కరెన్సీలో రూ.90లకు) అదే మంచి ఇళ్లను కూడా 4వేల యూరోల నుంచి 5 వేల యూరోల (అంటే మన దేశ కరెన్సీలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 4.5 లక్షల)కు అమ్మకానికి పెట్టారు.

Also read: Girl dancing on railway platform: రైల్వే స్టేషన్‌లో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్

కండిషన్స్ అప్లై
అయితే శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కొనుగోలు చేసే వారికి కొన్ని షరతులు విధించారు. ఇళ్లను ఖరీదు చేసిన యజమానులు మూడేళ్ళ లోపు కొన్న ఇంటికి మరమత్తులు చేయాల్సి ఉంది. ఈ కండిషన్(Conditions Apply) కు అంగీకరిస్తేనే ఒక యురోకి ఇళ్ల(one Euro houses)ను అమ్ముతున్నారు. చారిత్రాత్మక ప్రాంతమైన ఇక్కడ ఉన్న ఓల్డ్ బిల్డింగ్స్ ను కాపాడాలంటూ.. నగర్ మేయర్ ఆంటోనినో కమర్డా పిలుపునిచ్చారు. 1930లో ఈ గ్రామంలో 2,500 మంది ఉండే ఇక్కడ నివసిస్తున్న జనాభా తగ్గిపోతూ వస్తుంది. అయితే ఇటలీ దేశంలో గ్రామాలను కాపాడుకోవడానికి.. పల్లెలు జనాభాతో కలకాలాడడానికి ఇలా తక్కువ ధరకు ఇళ్లను అమ్మడం ఇదే మొదటిసారి కాదు.. ఇప్పటికే సలేమి, బిసక్సియా వంటి ప్రాంతాల్లో  అతి తక్కువ ధరకే ఇల్లు అమ్మకానికి పెట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News