Boddemma: బొడ్డెమ్మ అంటే ఏమిటి? ఈ పండుగను ఎలా చేసుకోవాలి? బతుకమ్మకు ఏమిటి సంబంధం

Boddemma Festival: తెలంగాణకు పండుగ కళ వచ్చేసింది. బతుకమ్మతోపాటు బొడ్డెమ్మ పండుగ వచ్చేసింది. మరి బొడ్డెమ్మ పండుగ విశేషాలు తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 30, 2024, 08:41 PM IST
Boddemma: బొడ్డెమ్మ అంటే ఏమిటి? ఈ పండుగను ఎలా చేసుకోవాలి? బతుకమ్మకు ఏమిటి సంబంధం

Telangana Boddemma Festival: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రకృతితో ముడిపడినవి. దసరా పండుగ వస్తే బతుకమ్మతోపాటు బొడ్డెమ్మ పండుగ కూడా వస్తుంటుంది. ఈ సమయంలో ఊరువాడా ఏకమై తెలంగాణ మొత్తం పండుగ వాతావరణంతో శోభిల్లుతోంది. బతుకమ్మ పండుగ అందరికీ తెలిసిందే. కానీ బొడ్డెమ్మ పండుగ విషయం కొందరికీ తెలుసు. బతుకమ్మ పండుగ అంటే ఏమిటి.. ఆ పండుగ ఎలా చేసుకోవాలే అనేది తెలుసుకుందాం.

Also Read: Lucky Zodiac Signs: అక్టోబర్ నెల రాశి ఫలాలు.. ఈ రాశుల వారు భోగభాగ్యాలతో పాటు విపరీతమైన సంపద పొందుతారు!

బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో.. నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో..
నీ బిడ్డ నీలగౌరు ఉయ్యాలో.. నిచ్చమల్లె చెట్టెసే ఉయ్యాలో..
చెట్టుకు చెంబెడు ఉయ్యాలో.. నీళ్లయినా పోసె ఉయ్యాలో..
కాయలు పిందెలు ఉయ్యాలో.. ఘనమై ఎగిసె ఉయ్యాలో..

హిందూవులు శివుని భార్య గౌరమ్మను తమ ఆడబిడ్డగా భావిస్తుంటారు. ఆమె శివుని సన్నిధికి చేరినట్లుగా పాడుకుంటారు. బొడ్డెమ్మ పండగ అనేది ప్రాంతాలవారిగా కొన్ని కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు ఐదు రోజుల ముందు బహుళ దశమి తిథి నుంచి ప్రారంభిస్తే ఇంకొన్ని ప్రాంతాలలో మూడు రోజుల ముందు బహుళ ద్వాదశి నుంచి బొడ్డెమ్మను పేర్చుకుంటారు. మరికొన్ని ప్రాంతాలలో భాద్రపద బహుళ అమావాస్య (మహాలయ) ముందు ప్రారంభమై 9 రోజులు బొడ్డెమ్మను పూజించి.. ఆడిపాడి తొమ్మిదో రోజున అంటే మహాలయ అమావాస్య రోజున నిమజ్జనం చేస్తారు. 

Also Read: Bathukamma Festival: బతుకమ్మ పండగ స్పెషల్.. ఈ ఇయర్ బతుకమ్మ పండుగ తేదీలు ఇవే..

 

వివిధ ప్రాంతాల్లో ఇలా..
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో బొడ్డెమ్మను నాలుగు రకాలుగా తయారుచేస్తారు. 'బొడ్డెమ్మ' అనే పేరుకు 'బొట్టె', బొడిప', పొట్టి అనే పదాలు కూడా ఉన్నాయి. 'బొడ్డ' అనే పదానికి 'అత్తిచెట్టు' అనే మరో అర్థం ఉంది. దీన్నే మేడిచెట్టు, ఉదంబర చెట్టు అని పిలుస్తారు. సంతానం కలగాలని.. పెళ్లి యోగం కలగాలని మేడిచెట్టు పూజిస్తారు. ఆ క్రమంలోనే ప్రకృతిని పూజిస్తూ చేసే మేడి పూజనే కాలక్రమంలో 'బొడ్డపూజ'గా మారింది. బొడ్డెమ్మను కన్నెపిల్లలు, పిల్లలు చేసుకుంటారు. గిరిజనుల 'తీజ్'లాంటిదే బొడ్డెమ్మ పండుగ.

బొడ్డెమ్మను నాలుగు రకాలుగా ఆయా ప్రాంతాల్లో తయారు చేస్తారు
పీట బొడ్డెమ్మ: చెక్క పీటపై పుట్టమన్నును ముద్దగా చేసి ఐదు దొంతర్లు (స్టెప్స్‌)గా చేస్తారు. అనంతరం పైన కలశాన్ని పెడతారు. గిన్నెలో బియ్యం పోసి పసుపు ముద్ద గౌరమ్మను చేస్తారు. అందులో పెట్టి పసుపు కుంకుమ అలంకరిస్తారు.

గుంట బొడ్డెమ్మ: మనిషి అడుగు పడని చోట ఒక గుంటను తవ్వి దాని చుట్టూరా ఐదు చిన్న గుంతలను తవ్వుతారు. ఈ గుంతలన్నింటినీ పూలతో అలంకరిస్తారు. ప్రతి మధ్య గుంటలోని పూలను తీయకుండా చిన్న గుంటల్లోని పూలను మాత్రం తీసి ఒక పాత్రలో పెట్టి నీటిలో వేస్తారు. దీనినే 'అంపుట' అంటారు.

పందిరి బొడ్డెమ్మ: పుట్టమన్నుతో పందిరి బొడ్డెమ్మను చేస్తారు. ఇంటి ముందు చిన్న పందిరి వేసి దాన్ని సీతాఫలం ఆకులతో కప్పుతారు. ఆ పందిరి కింద పేడతో అలికి ముగ్గులు వేస్తారు. పందిరి మధ్య నుంచి ఒక సీతాఫలాన్ని, ఒక మొక్కజొన్న కంకిని దారాలతో కట్టి కిందికి వేలాడదీస్తారు. వాటి కింద ముగ్గుల మధ్య బొడ్డెమ్మను అలంకరించి ఉంచుతారు. కొన్ని పూలు చల్లి పసుపు గౌరమ్మను బొడ్డెమ్మ పక్కన అమర్చుతారు. ఆ విధంగా పందిరి కింద చేయడంతో 'పందిరి బొడ్డెమ్మ' అని పిలుస్తారు. రోజూ ఆడి పాడి తొమ్మిదో రోజు నిమజ్జనం చేస్తారు.

బాయి బొడ్డెమ్మ: బావిలాగా గొయ్యి తయారుచేసే బొడ్డెమ్మను 'బాయి బొడ్డెమ్మ' అని అంటారు. బావిలాగా ఒక చిన్న గొయ్యిని తవ్వి మట్టిని తీసి అదే మట్టితో ముద్దలు చేస్తారు. నాలుగు ముద్దల చొప్పున బావికి నాలుగు వైపుల పెడతారు. ఆ బావి మధ్య ఒక వెంపలి చెట్టును నాటుతారు. చుట్టూ ఉన్న గద్దెలపై పువ్వులు వేసి పూజిస్తారు. చివరిరోజు ఈ పూలన్నింటినీ నీటిలో నిమజ్జనం చేస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News