Adhika Masa Amavasya Upavasam: జ్యోతిష్య శాస్త్రంలో అధిక మాస అమావాస్య ఎంతో ప్రత్యేకమనది. ఈ రోజు శ్రీ మహా విష్ణువును పూజించడం ఆనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా కొంతమంది భక్తులు ఈ రోజు శివుడిని కూడా పూజిస్తారు. అయితే ఇలా భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అయితే శని సాడే సతి, శని ధైర్య బాధలు ఉన్నవారికి వీటిని నుంచి ఉపశమనం పొందడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ రోజు శివలింగంతో శని దేవుడిని పూజించడం వల్ల శని సాడే సతి నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సాడే సతి నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శని సాడే సతితో బాధపడేవారు తప్పకుండా ఇలా పూజా కార్యక్రమాలు చేయండి:
శని సాడే సతితో బాధపడే కర్కాటక, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల వారు ఈ రోజు తప్పకుండా శివలింగంతో పాటు శని దేవుడికి ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా శని దేవుడి అనుగ్రహం పొందడానికి తప్పకుండా ఉనవాసాలు పాటించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఉపవాసాలు పాటించేవారు తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఉండాలి. ఇలా భక్తితో చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. లేకపోతు శని చెడు ప్రభావం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
శని సాడే సతి ఉపశమనం పొందడానికి ఇలా చేయండి:
❁ అధికమాసంలోని అమావాస్య రోజున శని సాడే సతితో బాధపడేవారు తప్పకుండా ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది.
❁ ఆ తర్వాత తలకు నువ్వుల నూనెను అప్లై చేసుకుని తల స్నానం చేయాలి.
❁ ఇలా స్నానం చేసిన తర్వాత పట్టు వస్త్రాలు ధరించాలి.
❁ మీ ఇంట్లోనే ఉన్న చిన్న గుడిలో శివుడి విగ్రహంతో పాటు శని దేవుడి విగ్రహాన్ని అలంకరించుకోవాలి.
❁ ఇలా చేసిన తర్వాత పాలు, గంగాజలంతో ఆ విగ్రహాలకు అభిషేకం చేయాలి.
❁ అభిషేకం చేసిన తర్వాత కుంకుమతో అలకరించుకుని..నైవేద్యాన్ని సమర్పించాలి.
❁ ఇలా పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత మీకు తోచినంత పేదవారికి సహాయాన్ని చేయాల్సి ఉంటుంది.
❁ ఈ రోజు నల్లని దుస్తువులను దానం చేయడం వల్ల అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి