Diwali 2022: జీవితంలో డబ్బే కీలక పాత్ర పోషిస్తుంది. జీవించడానికి ఊపిరితో పాటు డబ్బు చాలా ముఖ్యమైనది. సమాజంలో గుర్తింపు ఉండాలంటే తప్పకుండా డబ్బు ఉండాలి. అయితే ప్రస్తుతం చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి జోతిష్య శాస్త్రా నిపుపుణులు పలు రకాల చిట్కాలు, పరిహారాలు చెబుతున్నారు. వాటిని పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ పరిహారాలు దీపావళి రోజున లక్ష్మి దేవిని పూజించిన తర్వాత పాటిస్తే ఆర్థిక సమస్యలతో పాటు సంపాదన కూడా రెట్టింపు అవుతుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి చిట్కాలు పరిహారాలు పాటించడం వల్ల ధన వంతులవుతారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నం..
డబ్బును ఆకర్షించడానికి వాలెట్‌లో చేయాల్సిన మార్పులు ఇవే:
లక్ష్మీదేవి ఫోటో:
ఈ చిట్కా సంపదను పెంచే అత్యంత సాధారణమైనది. లక్ష్మీ దేవత సంపదకు చిహ్నంగా భావిస్తారు. అయితే మీరు ఉపయోగించే వాలెట్‌లో లక్ష్మీ దేవత ఫోటోను పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
శ్రీ యంత్రం:
ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు పవిత్రమైన శ్రీ యంత్రాన్ని తప్పకుండా పర్సులో లేదా జేబులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఆర్థిక పరమైన సమస్యలు సులభంగా తీరిపోయే అవకాశాలున్నాయి.
ఒక రూపాయి నోటు:
తెల్ల వాలెట్‌లో 2 ఒక రూపాయి నోట్లు, ఒక ఇరవై రూపాయల నోటు పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఖర్చుచేయకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఉసిరి ఆకులు:
ఉసిరి చెట్టును పూజించడం హిందువుల సాంప్రదాయం. అయితే ఈ ఆకులను గంగా జలంతో కడిగి మీ వాలెట్‌లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు దూరం కావడమేకాకుండా ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలుపుతన్నారు.
తామర గింజలు:
కమలం లక్ష్మిదేవికి ఎంతో ప్రతి కరమైన పువ్వు. అయితే జోతిష్య శాస్త్రంలో తామర గింజలు అదృష్టంగా భావిస్తారు. వీటిని మీ వాలెట్‌లో వేసుకుంటే దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు సులభంగా తీరుతాయి. అంతేకాకుండా వ్యాపారల్లో లాభాలు కూడా పొందుతారు.
వెండి నాణెం:
వెండి నాణెన్ని మీ పర్సులో ఉంచండం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
గోమతీ చక్రం:
గోమతీ చక్రాలను మీ వాలెట్‌లో బేసి దిశలో ఉంచడం వల్ల ఆర్థికంగా, మానసికంగా స్థిరంగా ఉంటారని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read : Vishnu Manchu Ginna Collections : జిన్నా పరిస్థితి మరీ దారుణంగా.. 50 షోలకు 49 టికెట్లు తెగాయా?
Also Read : Kantara 7 Days collection : ఏడురోజులకు ఐదురెట్ల లాభాలు.. ఆగని కాంతారా కాసుల వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook