Vijaya Ekadashi 2024: మీ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈరోజే ఈ ఒక్క పనిచేయండి..

Vijaya Ekadashi 2024 Remedy: హిందూమతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు విష్ణువుకు ఉపవాసం ఉండి పూజిస్తారు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంది. మార్చి 6న విజయ ఏకాదశి రానుంది.  

Written by - Renuka Godugu | Last Updated : Mar 6, 2024, 07:58 AM IST
Vijaya Ekadashi 2024: మీ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈరోజే ఈ ఒక్క పనిచేయండి..

Vijaya Ekadashi 2024 Remedy: హిందూమతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు విష్ణువుకు ఉపవాసం ఉండి పూజిస్తారు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంది. మార్చి 6న విజయ ఏకాదశి రానుంది.  అయితే, ఈరోజు విష్ణువును ఎలా పూజించాలి? ఏ పనులు చేయకూడదు తెలుసుకుందాం.విజయ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఉయదం నిద్రలేచి స్నానం చేసి విష్ణువు పూజ చేస్తారు. ఈసారి బుధవారం విజయ ఏకాదశి రానుంది. విష్ణుపూజ చేయడానికి ఉపవాసం ఉంటారు. ఈరోజు ముఖ్యంగా అన్నం తినరు మురా అనే అసురుడు ఇందులో ఉంటాడని ఏకాదశిరోజు అన్నానికి దూరంగా ఉంటారు. ఇక విష్ణుమూర్తి పూజలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు తామసిక ఆహారానికి దూరంగా ఉంటాయి. సాయంత్రం దగ్గర్లోని విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్లి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ విష్ణువు అనుగ్రహం మీకు లభిస్తుంది.

కోరుకున్న ఉద్యోగం పొందాలంటే విజయ ఏకాదశి ఎంతో విశిష్టమైంది. విష్ణువుకు ఎర్రటిపూలు, పండ్లు, మిఠాయిలను సమర్పించండి. ఇలా చేస్తే కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.  ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు పీఠం ఏర్పాటు చేసుకుని పసుపు గుడ్డను పరిచి ఫోటో లేదా విగ్రహం పెట్టి  కలశం ఏర్పాటు చేసుకుంటారు.. ఈరోజు పసుపురంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. అంతేకాదు ఈరోజు బార్లీకి కూడా ప్రాముఖ్యత ఉంది. విష్ణుమూర్తి పూజలో ఒక కప్పులో ఉంచండి. అలాగే నైవేద్యం సమర్పించండి.

ఇదీ చదవండి:  నెలవ్యవధిలోనే సూర్య-చంద్రగ్రహణాలు.. ఈ ఒక్క రాశికి మెగా బంపర్ ఆఫర్..

విజయం ఏకాదశి రోజు బియ్యం, దుస్తులు దానం చేయాలి. ముఖ్యంగా పేదలకు వీటిని దానం చేస్తే సుకఃసంతోషాలు కలుగుతాయి.ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ దానం చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడి జీవితంలో అనుకున్నది సాధిస్తారు. ఇంట్లో సుకఃశాంతులకు ఈరోజు ఇలా దానం చేయడం మంచిది. ముఖ్యంగా మీలోని ప్రతికూల భావోద్వేగాలను కూడా ఈరోజు విష్ణుమూర్తి ముందు త్యజించడం మంచిది.

విజయ ఏకాదశి 2024 పూజా ముహూర్తం..
విజయ ఏకాదశి మార్చి 6 ఉదయం 6:30 నుంచి మార్చి 7 ఉదయం 4:30 గంటలకు ముగుస్తుంది. ఉపవాసం ఆచారంచేవారు బుధవారం పాటిస్తారు. మరుసటి రోజు ఉపవాసం విరమిస్తారు.

ఇదీ చదవండి:  బుధవారం రాశి ఫలాలు.. ఈ రాశులవారికి లాభాలతో నష్టాలు!

ఏకాదశివ్రతం ఆచరించేవారు దానాలు కూడా చేయాలి. ఈరోజు తులసిమాత కూడా ఉపవాసం ఉంటుంది. కాబట్టి తులసి మొక్కకు ఏకాదశి రోజు నీరు పోయడం అపచారం. తులసిమాత పూజ సాయంత్రం నిర్వహిస్తారు. కానీ, ఈరోజు పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News