Shanidev: మనపై శనిదేవుడి అనుకూల ప్రభావం ఉందా లేదా ప్రతికూల దృష్టి ఉందా తెలుసుకోవడమెలా..!

Shanidev: కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు అని పిలుస్తారు. మీపై శనిదేవుడు అనుగ్రహం ఉందా లేదా ప్రతికూల ప్రభావం ఉందా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 11:33 AM IST
Shanidev: మనపై శనిదేవుడి అనుకూల ప్రభావం ఉందా లేదా ప్రతికూల దృష్టి ఉందా తెలుసుకోవడమెలా..!

Shanidev Grace: మన జీవితంలో జరిగే చాలా సంఘటనలతో శనిదేవుడు సంబంధం కలిగి ఉంటాడు. శనిదేవుడిని క్రూరగ్రహంగా, పాపపు గ్రహంగా పరగణిస్తాం. మనకు ఏదైనా చెడు జరిగితే శనిదేవుడిని తిట్టుకుంటూ ఉంటాం. మనం చేసే కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు, కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు.  శని దేవుడికి (Shanidev) మీపై అనుకూల దృష్టి ఉందా లేదా ప్రతికూల దృష్టి ఉందా అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇలా చేయండి. 

శని సానుకూల ప్రభావం
శనిదేవుని ఆశీస్సులు ఉన్న వ్యక్తి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాడు. శని సానుకూల దృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి దరిద్రుడైనా సరే ధనవంతుడు అవుతాడు.  శని అనుగ్రహం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. డబ్బు రావడం మెుదలవుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆలయం నుండి పాదరక్షలు మరియు చెప్పులు దొంగిలించబడటం కూడా శని దేవుడి యొక్క శుభ సంకేతంగా భావిస్తారు. 

శని ప్రతికూల దృష్టి
శని ప్రతికూల దృష్టి ఏ వ్యక్తిపై పడుతుందో అతడు బిలియనీర్ అయినా సరే బిచ్చగాడిగా మారుతాడు. ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురువుతాయి. అదృష్టం కలిసిరాదు. ఆరోగ్యం చెడిపోతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా నష్టాలను చవిచూస్తారు. ఆర్థికంగా తీవ్రఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. మీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. 

Also Read: Mahapurusha Raja Yoga: 'మహాపురుష రాజయోగం' చేస్తున్న తిరోగమన కుజుడు.. ఈ రాశులకు లాభాలు బోలెడు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News