Good Luck Remedies, If you want good luck to always be with you Do these three things: ప్రతి వ్యక్తి తన జీవితంలో గొప్ప విజయం సాధించాలని నిత్యం కోరుకుంటాడు. జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఆశిస్తాడు. ఇందుకోసం పగలు మరియు రాత్రి కష్టపడతాడు. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాల కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. అయినా కూడా అదృష్టం కలిసిరాకపోతే.. ఆ వ్యక్తి చాలా నిరాశ చెందుతాడు. దరిద్రం తాండవిస్తున్న సమయంలో కొన్ని నివారణలు చేస్తే.. అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది.
జ్యోతిషశాస్త్రంలో కొన్ని సులభమైన నివారణలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా జీవితంలో భాగం చేసుకుంటే.. వ్యక్తి ఉన్న సకల దరిద్రం పోయి అదృష్టం తలుపుతడుతుంది. ప్రతి పనిలో సానుకూల ఫలితాలను పొందుతాడు. దాంతో ఆ వ్యక్తి తన జీవితంలో గొప్ప విజయం సాధిస్తాడు. జ్యోతిషశాస్త్రంలోని మూడు సులభమైన నివారణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవుకు మొదటి రోటి:
హిందూ మతంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉదయం పూట ఆహారం తయారు చేశాక ఆవుకు మొదటి రోటిని తీయాలి. అలానే కుక్క కోసం చివరి రొట్టెని పక్కకు పెట్టాలి. దీన్ని క్రమం తప్పకుండా చేయడం ద్వారా పితృ దోషం తొలగిపోతుంది. దాంతో వ్యక్తికి అదృష్టం మొదలవుతుంది. ఏ పనిలోనైనా అడ్డంకుల నుంచి విముక్తి లభిస్తుంది.
అరటి చెట్టుకు పూజలు:
జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి గ్రహాన్ని 'భాగ్యేష్' అని కూడా పిలుస్తారు. వ్యక్తి జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉంటే.. ప్రతి పనిలో నిరాశే ఎదురవుతుంది. అందుకే బృహస్పతి గ్రహాన్ని బలోపేతం చేయడానికి ప్రతి గురువారం ఉపవాసం ఉండాలి. ఆ రోజున అరటి చెట్టును పూజించాలి. ఇలా చేయడం వల్ల భగవంతుడు శ్రీహరి అనుగ్రహం పొంది జీవితంలో సుఖసంతోషాలు వస్తాయి.
పక్షులకు ఆహారం:
పక్షులకు ఆహారం ఇచ్చే పనిని మీ రోజు వారి పనిలో ఓ భాగంగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం దేవుడిని దర్శించుకోవడం, పక్షులకు ఆహారం పెట్టడం ద్వారా అదృష్టం మీ సొంతమవుతుంది. అప్పుడు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు.
Also Read: Janhvi Kapoor Pics: మినీస్‌లో యోగా చేస్తున్న జాన్వీ కపూర్.. హాట్ స్టిల్స్ అదిరిపోయాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook