Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 18 జూన్ 2021, Rasi Phalalu, ఓ రాశివారికి ఉద్యోగావకాశాలు

Horoscope Today In Telugu 18 June 2021: మీ మాటకారితనం, నైపుణ్యాలు ఆర్థిక లావాదేవిలు, బ్యాంకు సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయాలలో భేదాలు తలెత్తడం ద్వారా కొంత చికాకు ఏర్పడుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2021, 08:50 AM IST

Trending Photos

Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 18 జూన్ 2021, Rasi Phalalu, ఓ రాశివారికి ఉద్యోగావకాశాలు

Horoscope Today 18 June 2021: మేష రాశి
నేడు ఆధ్యాత్మిక విషయాలపై ఫోకస్ చేస్తారు. కొన్ని ప్రాజెక్టులు చేతికి అందుతాయి. పనిచేసే చోట మీ యజమానితో మీ రిలేషన్ బలోపేతం అవుతుంది. మీపై పెరిగే నమ్మకం భవిష్యత్తులో ప్రమోషన్ అవకాశాలు పెంచుతుంది. వ్యాపారులకు పెట్టిన పెట్టుబడులకు లాభాలు అందుకుంటారు.

వృషభ రాశి
కెరీర్ గురించి ఆలోచన మొదలవుతుంది. భవిష్యత్ ఎలా ఉండనుంది, ఏం చేయాలనుకుంటున్నారో దానిపై దృష్టిసారిస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని మార్పులు సంభవిస్తాయి. మీ యజమాని మీ పనిని గమనిస్తున్నందున మీరు పనిచేసే చోట ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్

మిథున రాశి
ఈ రాశివారికి నేడు చంద్రుడి అనుగ్రహం ఉంటుంది. గత కొన్ని రోజులుగా నిలిచిపోయినా చెల్లింపులు ఈ రోజు క్లియర్ కానున్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు చేతికి అందుతుంది. విద్యార్థులు ఈ రోజు చదువుల పట్ల దృష్టి పెడతారు. కొత్త ప్రాజెక్టులలో ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. 

కర్కాటక రాశి 
మీ మాటకారితనం, నైపుణ్యాలు ఆర్థిక లావాదేవిలు, బ్యాంకు సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయాలలో భేదాలు తలెత్తడం ద్వారా కొంత చికాకు ఏర్పడుతుంది. మీ ప్రొఫెషనల్ లైఫ్‌ను ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లయితే, మీరు కొత్త కోర్సులు నేర్చుకోవడం మొదలుపెట్టాలి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. 

సింహ రాశి
మీరు ఏదైన కొత్తది ప్రారంభించాలనుకుంటే, ఈ రోజు అది చేయడానికి మంచి రోజు. సన్నిహితుల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. తల్లిదండ్రులు ఈ రోజు మీ దృష్టిని కోరుకునే అవకాశం ఉంది. ఈ రోజు మీ ఉద్యోగాన్ని మార్చడానికి మీరు ప్లాన్ చేస్తారు. ప్రయణాలు చేయడంతో ఖర్చులు అధికం కానున్నాయి.

కన్య రాశి
ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైనా సంతకం చేయడానికి ముందు మీరు అన్ని పత్రాలను పూర్తిగా చదవడం మాత్రం మరిచిపోవద్దు. ఈ రోజు విద్యార్థులు పరధ్యానంలో ఉంటారని తల్లిదండ్రులు గుర్తిస్తారు. ఉద్యోగులు పనిచేసే చోట కాస్త విరామం తీసుకుంటారు.

Also Read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ? 

తులా రాశి
వచ్చే రాబడి కంటే ఖర్చులు అధికం కానున్నాయి. అనవసర విషయాలలో డబ్బు ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి, కొత్త బిజినెస్ ప్రారంభించడానికి వ్యాపారులకు ఇది తగిన సమయం. 

వృశ్చిక రాశి 
మీరు గతంలో ఎదుర్కొన్న నష్టాలు కాలం కలిసిరావడంతో లాభాలుగా మారుతాయి. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. భార్యాభర్తలు తమ జీవితంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఉద్యోగులకు పని భారం తగ్గనుంది. 

ధనుస్సు రాశి
ప్రయాణాలు మానుకోవడం ఉత్తమం. లేనిపక్షంలో అనారోగ్యం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఒంటరిగా ఒక మత స్థలాన్ని సందర్శించే అవకాశం ఉంది. స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇవ్వాలని భావిస్తారు. మీరు చేపట్టిన కొన్ని పనులు పూర్తవుతాయి. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మిమ్మల్ని కలుసుకుంటారు.

మకర రాశి
మీ కెరీర్‌లో మీరు తీసుకుంటున్న మార్గాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, ఈ విషయంలో మీరు చాలా బాధపడతారు. మీ చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు మీపై కుట్ర పన్నుతారు. మీ జీవిత భాగస్వామితో సమస్య ఉంటే కూర్చుని చర్చించుకుని పరిష్కారం గురించి ఆలోచించాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇంట్లోనే ఉండాలి.

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే 

కుంభ రాశి
మీ జీవిత భాగస్వామిపై మీరు అనుకున్నదానికంటే ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. మీరు పనిలో తీరికలేకుండా ఉంటారు. దానివల్ల ఇంట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలు తద్వారా చికాకులు. మీరు కొత్త వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. వీలైతే మరొకరితో కలిసి వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంటారు. .

మీన రాశి
నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. మీ సమస్యలు కొన్ని షరిష్కారం అవుతాయి. విద్యార్థుల దృష్టి అధ్యయనాలపై ఉంటుంది. ఇంట్లో కొన్ని పనులు అందర్నీ తీరిక లేకుండా చేస్తాయి. పనిలో మెరుగైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News