Horoscope Today July 15th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారికి గడ్డుకాలం..

Horoscope Today July 15th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ వృషభ, కన్య, మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2022, 06:34 AM IST
  • ఇవాళ మేష, మిథున, కర్కాటక తదితర రాశుల వారికి సానుకూల సమయం
  • వృషభ, కన్య, మకర రాశుల వారికి ప్రతికూల ఫలితాలు
  • నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందంటే
Horoscope Today July 15th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారికి గడ్డుకాలం..

Horoscope Today July 15th 2022: ఇవాళ శుక్రవారం. హిందువులు లక్ష్మీ దేవి, సంతోషి మాత, అన్నపూర్ణేశ్వరి, దుర్గా మాతలను కొలిచే రోజు. శుక్రవారం భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని కొలిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. మరి ఈ శుక్రవారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 

మేష రాశి (Aries)

ఇవాళంతా సంతోషకరంగా సాగుతుంది. మేదోపరమైన అధ్యయనం కోసం మీ సమయాన్ని వెచ్చిస్తారు. మీ ఉత్సాహం,శక్తి సామర్థ్యాలు మీరు చేపట్టిన పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తాయి. అది మీ ప్రతిష్ఠను పెంచుతుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్లాన్ చేసుకుంటారు. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులకు శుభవార్త అందే అవకాశం ఉంది.

వృషభ రాశి (Taurus)

ఈరోజు ప్రారంభం కాస్త నిరాశజనకంగా ఉండొచ్చు. సాయంత్రం సమయానికి మీపై నెగటివిటీ నియంత్రణలోకి వస్తుంది. వృత్తిపరంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ వ్యాపారానికి కొత్త రూపు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఆచీ తూచీ వ్యవహరించాల్సి ఉంటుంది.

మిథున రాశి (GEMINI)

పెద్దల ఆశీస్సులతో అనిశ్చితి పరిస్థితులు సర్దుకుంటాయి. పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. పని విషయంలో మీ కొలిగ్స్ నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. చేపట్టిన ప్రాజెక్టును సక్సెస్ చేయడంలో ఆ సహకారం కీలకమవుతుంది. మీ పనితీరు కారణంగా ఆఫీసులో ఇన్సెంటివ్స్ పొందుతారు. డైరీ, తృణ ధాన్యాలు, వాటర్ ప్రాజెక్ట్స్, హోమ్ మేకర్ ఆర్ట్ తదితర రంగాల్లోని వారికి పూర్తిగా సానుకూల సమయం.

కర్కాటక రాశి (Cancer) 

ఫ్యామిలీ గెట్ టు గెదర్ లేదా సోషల్ ఈవెంట్స్‌లో బిజీగా గడుపుతారు. మీ బంధువు ఒకరి నుంచి శుభవార్త అందే అవకాశం ఉంటుంది. ఇంటి కోసం కొన్ని కళాకృతులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ మీ చుట్టూ ఉండేవారితో మర్యాదపూర్వకంగా మెలుగుతారు. అది మీ పట్ల అందరిలో సదాభిప్రాయం నెలకొనేలా చేస్తుంది.

సింహ రాశి (LEO)

చంద్ర అనుగ్రహంతో ఇవాళ సంతోషంగా గడుపుతారు. మునుపటికన్నా ఆరోగ్యంగా ఉంటారు. పనిలో ఉత్సాహం రెట్టింపవుతుంది. చేపట్టిన పనిని సకాలంలో పూర్తి చేసేందుకు ఒళ్లు దాచుకోకుండా కష్టపడుతారు. మీ ఏకాగ్రతను ఎవరు చెదరగొట్టలేరు. వ్యాపార వృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

కన్య రాశి (Virgo)

పాత అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెడుతాయి. అది మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. లాంగ్ టూర్స్ లేదా లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునేవారు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. మీరు ఎదుర్కొంటున్న వివాదాల్లో రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర విషయాలపై చర్చలతో లేని వివాదాలు తెచ్చుకోవద్దు.

తులా రాశి (Libra)

ఇవాళంతా సంతోషంగా గడుస్తుంది. పనిలో సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. మీ మేనేజ్‌మెంట్ స్కిల్స్ మీ బాస్‌ను ఆకట్టుకుంటాయి. సమీప భవిష్యత్తులో మీ పనికి తగిన ఫలితం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. తద్వారా మీ సేవింగ్స్ పెరుగుతాయి. భార్య లేదా భర్తతో మీ బంధం మరింత బలపడుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగేందుకు అది దోహదపడుతుంది.

వృశ్చిక రాశి (Scorpio)

వృత్తిరీత్యా బిజీ బిజీగా గడుపుతారు. అది మిమ్మల్ని కొంత అలసటకు గురిచేయవచ్చు. ఓవర్‌సీస్‌లోనూ మీకంటూ సొంత నెట్‌వర్క్ ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి జాబ్ ప్రమోషన్ లభించవచ్చు. పెట్టుబడుల విషయంలో ఆచీ తూచీ వ్యవహరించాలి.

ధనుస్సు రాశి (Sagittarius)  

నెగటివిటీ నియంత్రణలో ఉంటుంది. విధి మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు ఉంటాయి. గతంలో వాయిదా వేయబడ్డ పనులను తిరిగి చేపట్టేందుకు సానుకూల సమయం. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. అక్కడ మీకు మనశ్శాంతి లభిస్తుంది. మతపరమైన సంస్థలకు లేదా సేవా సంస్థలకు తోచిన సాయం అందజేస్తారు.

మకర రాశి (Capricorn) 

ఇవాళ మీ జాతకంలో చంద్రుడి స్థానం నెగటివ్ ప్రభావం చూపుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడులు నష్టాలు తీసుకొస్తాయి. వ్యాపార విస్తరణకు ప్రతికూల సమయం. గతంలో వచ్చిన లాభాలు కూడా ఇప్పుడు నష్టాల రూపంలో కరిగిపోతాయి. అనవసర విషయాల్లో తలదూర్చి వివాదాలు కొనితెచ్చుకోవద్దు. అది మీపై చాలా నెగటివ్ ప్రభావం చూపుతుంది.

కుంభ రాశి (Aquarius)

చంద్ర అనుగ్రహం లభిస్తుంది.వృత్తిపరంగా శుభవార్త వింటారు. కుటుంబ జీవితం ఆనందమయంగా సాగుతుంది. అయితే కీలక పనుల్లో అత్యుత్సాహం పనికిరాదు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతారు. విద్యార్థులు తమ చదువులపై మరింత శ్రద్ధ పెట్టాలి. కొన్ని విషయాలు మీ సహనాన్ని పరీక్షించవచ్చు. అంతిమంగా విజయం మీదే అవుతుంది.

మీన రాశి (Pisces) 

బంగారానికి సంబంధించిన పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి. చంద్ర అనుగ్రహంతో అంతా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ప్రేమ వికసిస్తుంది. అవివాహితులైనవారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీ సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Sushmita Sen Dating: మరోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్‌.. ఈసారి మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌తో..!  

Also Read: Godavari Floods 2022: గోదావరి మహోగ్రరూపం, 51 గ్రామాలు జలదిగ్భంధనం, రాత్రికి మూడవ హెచ్చరిక

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News