Devara First Single: ఎన్టీఆర్ హీరోగా కొరటాల కాంబోలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా దేవర. ఎప్పుడో 2022 లో ఆర్ ఆర్ ఆర్ లో కనిపించిన ఎన్టీఆర్ ను మళ్ళీ తెరపై చూడాలని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఫియర్ సాంగ్ అని మొదటి పాటను రిలీజ్ చేశారు.
రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటకి అనిరుధ్ ట్యూన్ సెట్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు పాట బాగుందని కామెంట్లు పెట్టారు కానీ మామూలు నెటిజన్లు మాత్రం పాట విషయంలో అంత సంతోషంగా లేరు అని చెప్పచ్చు. అనిరుధ్ మ్యూజిక్ చాలా యావరేజ్ అని, విజువల్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక లిరిక్స్ అయినా బాగున్నాయా అని అనుకుంటే అవి కనీసం చదవడానికి కూడా కష్టంగా ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ విజువల్స్ అన్నీ బాగున్నాయి కానీ అనిరుధ్ ఇచ్చిన సంగీతం డామినేటింగ్ గా లేదు అని.. లిరిక్స్ ను డామినేట్ చేశాయని అంటున్నారు. కొందరైతే తారక్ కన్నా అనిరుధ్ హీరోయిజం ఎక్కువగా కనిపించింది అని చెబుతున్నారు.
తమిళ్ లో మాత్రం చార్ట్ బస్టర్ పాటలు అందిస్తున్న అనిరుధ్ రవి చందర్.. తెలుగు ప్రేక్షకుల పల్స్ ను మాత్రం సరిగ్గా పట్టలేకపోతున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో రాణించాలంటే ఇంకా కష్టపడాల్సి ఉంటుంది అని సూచిస్తున్నారు. ఉదాహరణకి దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 2 లో.. పాటల లాగా.. ప్యాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యే పాటలు ఇస్తున్నారు. కానీ అనిరుద్ మాత్రం లోకల్ మ్యూజిక్ లో మిగిలిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.
దీంతో పాపం ఎప్పటినుండో దేవర అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకి కేవలం నిరాశ మాత్రమే మిగిలింది. అయితే ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ అందరికన్నా ఎక్కువగా ఉండి అనే వార్తల కూడా ఉన్నాయి. మరి అంతంత రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు అనిరుద్ మ్యూజిక్ కూడా ఆ రేంజ్ లో ఇస్తేనే ప్రేక్షకులు ఫిదా అయ్యేలా కనిపిస్తున్నాడు.
ఇక ఫస్ట్ సింగిల్ పక్కన పెడితే.. అనిరుద్ కనీసం రెండవ పాటతో అయినా ఆకట్టుకుంటారా లేదా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా ఫ్యాన్స్ ను ఈ ధోరణి నుండి బయటకి తీసుకురావాలి అంటే కొరటాల వెంటనే సినిమాకి సంబంధించి ఏదైనా అదిరిపోయే అప్డేట్ అయితే ఇవ్వాలి. ఇలానే ప్రతి అప్డేట్ కి అంచనాలు పడిపోతూ వస్తే మాత్రం సినిమా విడుదల అయ్యే సమయానికి బజ్ మొత్తం తగ్గిపోతుంది అని అభిమానులు కంగారుపడుతున్నారు.
Also Read: Kavtiha: కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే! కానీ ఇక్కడే భారీ ట్విస్ట్.. ఏం జరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter