Godavari Floods: గోదావరి మహోగ్రరూపం దాలుస్తోంది. భారీ ఎత్తున వరద నీటితో విధ్వంసం సృష్టిస్తోంది. కోనసీమలో 51 గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. భద్రాచలంలో ప్రమాదకరస్థాయికి చేరుకోవడం ఆందోళన కల్గిస్తోంది.
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి విశ్వరూపం దాలుస్తోంది. రాజమండ్రి, ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం భయం గొలుపుతోంది. 2006 తరువాత గోదావరి నదికి భారీ వరద ఇదే కావడం విశేషం. అటు జూలై నెల వరద చరిత్ర చూస్తే మాత్రం గత వందేళ్లలో ఇదే తొలిసారి. భద్రాచలం వద్ద ఇప్పటికే గోదావరి వరద నీటిమట్టం 63 అడుగులకు చేరుకోగా..రాత్రికి 65 అడుగులు చేరుకునే పరిస్థితి ఉంది. రేపటికి 70 అడుగులకు చేరవచ్చని అంచనా. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రాత్రికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ కానుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 17 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా..24 లక్షల క్యూసెక్కుల వరకూ వరద నీరు పోటెత్తవచ్చని అంచనాలున్నాయి.
గోదావరి వరద చరిత్ర
దాదాపు 16 ఏళ్ల తరువాద గోదావరి నది మహోగ్రరూపం దాల్చడం ఇదే. గతంలో అంటే 2006లో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. అప్పట్లో గోదావరి నదికి 28 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తగా..1986లో చరిత్రలో అత్యధికంగా 32 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించింది. ఈసారి 24 లక్షల క్యూసెక్కుల వరకూ వరద రావచ్చని అంచనా వేస్తున్నారు.
భయం గొలుపుతున్న గోదావరి
ప్రస్తుతం గోదావరి నది నీటిమట్టం భద్రాచలంలో 63 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దాదాపు 17 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. రాత్రికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ కానుంది. అటు భద్రాచలంలో రాత్రికి వరద నీటిమట్టం 65 అడుగులకు, రేపటికి 70 అడుగులకు చేరుకోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే భద్రాచలం వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంతో బయటి ప్రపంచానికి సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. మరోవైపు గోదావరి వరద ప్రవాహంతో విలీన మండలాలు దాదాపుగా నీట మునిగాయి. కోనసీమలో 42 గ్రామాలు జల దిగ్భంధనమయ్యాయి. మూడవ ప్రమాద హెచ్చరికకు ముందే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కోనసీమలో వైనతేయ, వశిష్ట, వృద్ధ గౌతమి నదులు ఉగ్రరూపం దాల్చాయి. పి గన్నవరం పాత అక్విడెక్ట్ ను వరద నీరు తాకడం 1986 తరువాత ఇదే.
గోదావరి వరద నీరు అంతకంతకూ పెరుగుతుండటంతో గోదావరి గట్టు వెంబడి గ్రామాలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. రాజోలు వద్ద 2-3 ప్రాంతాల్లో గట్టు బలహీనంగా ఉన్నాయని తెలుస్తోంది. లంక గ్రామాల్లో ఇప్పటికే 3-5 అడుగుల వరద నీరు చేరుకుంది. పొలాలు, గ్రామాలు ఏకమైపోయాయి.
Also read: Godavari Floods: రేపు గోదావరి నదికి మూడవ ప్రమాద హెచ్చరిక, లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook