Mangala Gauri Vrat 2022: ఇవాళ శ్రావణ మాసం చివరి మంగళ గౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని (Mangala Gowri Vratam 2022) ఈ మాసంలోని ప్రతి మంగళవారం ఆచరిస్తారు. అంతేకాకుండా ఈ రోజు శ్రావణ మాసం రెండో ప్రదోష వ్రతం (Pradosh Vratam 2022)కూడా. ఇవాళ పార్వతీదేవితో పాటు శివుడిని పూజించడం వల్ల మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈరోజు శ్రావణ మాసం శుక్లపక్షం త్రయోదశి కూడా. ఈ వ్రత ప్రాముఖ్యత, పూజ విధానం తదితర విషయాలు గురించి తెలుసుకుందాం.
ఈరోజు ప్రదోష వ్రత ముహూర్తం: సాయంత్రం 07:06 నుండి 09:14 వరకు.
వ్రత విధానం
ఈరోజు ఉదయం స్నానమాచరించి.. ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయాలి. అనంతరం పూజను ఆరంభించాలి. పూజలో శివుడు, గణపతి మరియు మాతా పార్వతి విగ్రహాలను మట్టితో చేసినవి లేదా వారి చిత్రపటాలను ఉంచండి. మొదటగా వినాయకుని అక్షత, దూర్వా, పూలు, కుంకుమ, చందనం, ధూపం, దీపం మొదలైన వాటితో పూజించండి. ఆ తర్వాత శివునికి గంజాయి, బేల్పత్రం, దాతుర, చందనం, తెల్లని పూలు, గంగాజలం, పండ్లు, చెక్కుచెదరని తేనె మొదలైన వాటిని సమర్పించండి. అనంతరం పార్వతీ దేవికి ఎర్రటి పువ్వులు, పండ్లు, కుంకుమ, చునారి, 16 అలంకరణ వస్తువులను సమర్పించండి. ఇప్పుడు శివపార్వతుల ముందు దీపం వెలిగించి...ధూపం వేయండి. దీని తర్వాత మంగళ గౌరీ వ్రత కథ మరియు ప్రదోష వ్రత కథను చదవండి లేదా వినండి. చివరగా హారతి ఇచ్చి... ప్రార్థించండి.
ఈరోజు ఉపవాసం వల్ల కలిగే 5 ప్రయోజనాలు
1. ఇవాళ ఉపవాసం పాటించడం మరియు మాత మంగళ గౌరీని పూజించడం ద్వారా.. వివాహిత స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉంటారు. అంతేకాకుండా వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
2. ఈరోజు ఉపవాసం చేస్తూ...ప్రదోష కాలంలో శివుడిని పూజిస్తే ఆరోగ్యంగా ఉండటంతోపాటు మీ దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది.
3. మంగళవారం నాడు ప్రదోష వ్రతం పాటిస్తే దానిని భౌం ప్రదోష వ్రతం అంటారు. ఈరోజు శివుని పూజించడం ద్వారా కుజ దోషాలు తొలగిపోతాయి.
4. మంగళ గౌరీని పూజించడం మరియు కొన్ని పరిహారాలు చేయడం వల్ల అంగారక దోషాలు తొలగిపోతాయి. వివాహానికి ఉన్న ఆటంకాలు దూరమవుతాయి.
5. ఈరోజు మాత మంగళ గౌరీ సమేతంగా శివుడిని పూజిస్తే రెండు ఉపవాసాల పుణ్యఫలాలను పొందవచ్చు.
(NOTE: ఈ సమాచారం అంతా సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. Zee Telugu News దీనిని ధ్రువీకరించడం లేదు. పూర్తి వ్రత విధానం కోసం ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తుల సలహా తీసుకోవాలి.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook