Sankashti Chaturthi 2022: సంకష్టి చతుర్థి రోజున ఇలా వ్రతాలు చేస్తే.. జీవితంలో కష్టాలు దూరమై.. డబ్బే..డబ్బు..

Sankashti Chaturthi Dates 2022: సంకష్టి చతుర్థి రోజున గణేషున్ని పూజించడం వల్ల జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2022, 11:37 AM IST
Sankashti Chaturthi 2022: సంకష్టి చతుర్థి రోజున ఇలా వ్రతాలు చేస్తే.. జీవితంలో కష్టాలు దూరమై.. డబ్బే..డబ్బు..

Sankashti Chaturthi Dates 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు సంకష్టి చతుర్థి ఉపవాసం పాటిస్తారు. అంతేకాకుండా ఈ సంకష్టి చతుర్థి చాలా ప్రముఖ్యత ఉంది. ఇలా ఉపవాసాలు పాటించి భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించడం వల్ల అనుగ్రహం లభించి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో ఎదో ఒక రోజు సంకష్టి చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటారు. అయితే డిసెంబర్‌ నెలలో సంకష్టి చతుర్థి 11 తేదిన రాబోతోంది. ఈ రోజు ఉపవాసాలు పాటించి గణేషున్ని పూజించడం వల్ల కోరుకున్న కోరికలన్ని నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ వ్రతాన్ని పాటించడం వల్ల జీవితంలో సకల దుఃఖాలు దూరమై బాధలు తొలగిపోతాయి. అయితే సంకష్టి చతుర్థి వ్రతాన్ని పాటించే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఫలితాలు పొందలేరని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సంకష్టి చతుర్థి పూజ ముహూర్తం:
చతుర్థి తేదీ ప్రారంభం - 11 డిసెంబర్‌ 2022 రాత్రి 08.17 గంటలకు
చతుర్థి తేదీ ముగుస్తుంది - 12 డిసెంబర్‌ 2022 రాత్రి 10.25 గంటలకు

అయితే ఈ వ్రతాన్ని చేసుకునేవారు కేవలం గణేషున్ని ఉదయం 08:02 నుంచి 09:23 వరకు, మధ్యాహ్నం 01:26 నుండి సాయంత్రం 04:08 సమయాల్లో పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో అన్ని దేవతలకు పూజలు చేసుకోవచ్చు.

సంకష్టి చతుర్థి పరిహారం:
>> జీవితంలో కష్టాలు అనుభవిస్తువారికి ఈ క్రమంలో విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఓం గంగా గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి.
>> జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వత్రాన్ని పాటించిన తర్వాత ఇంటికి యాంత్రాన్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆరాధన తర్వాత వినాయకుడికి తీసి వస్తువులను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
 >> వ్రతాన్ని పాటించన తర్వాతం తప్పకుండా వినాయకున్ని మందిరానికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో 'వక్రతుండాయ మహాకాయ' మంత్రాన్ని పాటించాలని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>> అయితే ఈ క్రమంలో తప్పకుండా వినాయకుడికి బెల్లం, నెయ్యి సమర్పించాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)   

Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?

Also Read: Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News