Shani Dev: మినప పప్పుతో శనిదేవుడికి ఇలా చేస్తే... పేదరికం పోతుందట!

Shani Dev Remedies: శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శనిదేవుడి కోపానికి గురైన వ్యక్తి ధనవంతుడైనా సరే దరిద్రుడిగా మారుతాడు. జాతకంలో శనిదోషం తొలగిపోవాలంటే కందిపప్పుతో ఈ పరిహారం చేయండి.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2022, 03:47 PM IST
Shani Dev: మినప పప్పుతో శనిదేవుడికి ఇలా చేస్తే... పేదరికం పోతుందట!

Shani Dev Remedies: మనం వారానికొకసారైనా పప్పు తింటాం. దాదాపు అందరి ఇళ్లలోనూ దీనిని తింటారు. మనం చేసే మంచి, చెడు పనులను బట్టి ఫలాలను ఇచ్చేదేవుడు శనిదేవుడు (Shani Dev). అందుకే ఈయనను న్యాయదేవుడు, కర్మదాత అని కూడా అంటారు. శని మహాదశ, శనివక్ర దృష్టి ఎవరిపై ఉంటుందో ఆ వ్యక్తి నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. అలాంటి శని అగ్రహాన్ని తగ్గించడానికి ఆస్ట్రాలజీలో  అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. మినప పప్పుతో శనిదేవుడికి పరిహారం చేస్తే మీ పేదరికం తొలగిపోతుందట. అంతేకాకుండా ఉడకబెట్టిన పప్పు తింటే జాతకంలోని శనిదోషం కూడా పోతుందని నమ్ముతారు. అయితే ఈ చర్యలు శనివారం చేస్తేనే ఫలిస్తాయట.

మినప పప్పుతో ఈ పరిహారాలు చేయండి..

>> మీ దురదృష్టం అదృష్టంగా మారాలంటే..శనివారం సాయంత్రం మినప పప్పు నుండి రెండు గింజలను తీసుకొని వాటిపై కొంచెం పెరుగు, కుంకుమ రాయండి. అనంతరం ఆ గింజలను రావిచెట్టు కింద ఉంచి.. తిరిగి చూడకండి. ఇలా 21 శనివారాలు చేయండి. దీంతో మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది.

>> జాతకంలోని శని దోషం తొలగిపోవాలంటే.. శనివారం నాడు 4 ఉసిరికాయలను తీసుకుని కాకులకు తినిపించాలి. ఈ పరిహారాన్ని 7 శనివారాలు చేయండి.

>> మీ పేదరికం పోవాలంటే..ఆవాల నూనెను ఒక పాత్రలో నింపి శనివారం మంచం కింద ఉంచాలి. తర్వాత రోజు ఆ నూనెలో కుడుములు తయారు చేసి కుక్కలకు తినిపించండి.

Also Read: Budh Margi 2022: రేపటి నుండి మార్గంలోకి బుధుడు. ఈ 4 రాశులవారికి అంతులేని ఐశ్వర్యం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News