Shani Gochar 2024 effect: పురాణాల ప్రకారం, శనిదేవుడు.. సూర్యదేవుడు పుత్రుడు. మనం చేసే కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 2025 వరకు ఇదే రాశిలో ఉంటాడు. జనవరి 11న శని గ్రహం శతిభిషా నక్షత్రంలోకి ప్రవేశించింది. శనిదేవుడు కుంభరాశి సంచారం, నక్షత్ర రాశి మార్పు కారణంగా మూడు రాశులవారు ఈ ఏడాదంతా ఆ దేవుడి అనుగ్రహం పొందుతారు. దీంతో వీరికి దేనికీ లోటు ఉండదు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
శని గ్రహ సంచారం ఈ 3 రాశులకు వరం
ధనుస్సు రాశి
శనిదేవుని సంచారం వల్ల ధనస్సు రాశి వారు ఆర్థికంగా లాభపడతారు. ఆఫీసులో మీ వర్క్ కి ప్రశంసలు లభిస్తాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. శుభవార్త వినే అవకాశం ఉంది. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది, జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
కుంభరాశిలో శనిదేవుడు సంచారం కర్కాటక రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీపై శనిదేవుడు సడేసతి మరియు దైయా ముగుస్తుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. కోడళ్లకు అత్తమామల పోరు ఉండదు. వ్యాపారం వృద్ధి చెందుతుంది.
తులారాశి
శనిదేవుడు రాశి మార్పు తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ ప్రేమ పెళ్లికి దారి తీయవచ్చు. జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు సంతాన సుఖం కలుగుతుంది. మీరు పేదరికం నుండి బయటపడతారు.
Also Read: Sun Transit 2024: ఆ 4 రాశులకు మరో మూడ్రోజుల్లో మారనున్న జాతకం, ఊహించని ధనలాభం
Also Read: Venus Transit 2024: ఫిబ్రవరి 12 నుంచి ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్, ఊహించని డబ్బు
.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook