Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు రాముడి కన్న ముందు వీరిని పూజించాలంటా.. ఈ రహస్యం మీకు తెలుసా..?

Sri rama navami 2024:  శ్రీరామనవమి పండుగను ఊరువాడ, ఎక్కడ చూసిన  ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఎక్కడ చూసిన ప్రత్యేకమైన పందిళ్లను ఏర్పాట్లు చేసి రాముల వారి కళ్యాణాలను జరిపిస్తారు. ఈరోజున శ్రీరాముల వారిని పూజించడం మనకు తెలిసిందే. కానీ పురాణాల ప్రకారం ఈరోజు శ్రీరాముడితో పాటు వీరిని కొలిస్తే ఎంతో ఆనందిస్తాడంట.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 16, 2024, 11:45 PM IST
  • శ్రీరామ నవమిని భక్తులు వేడుకగా జరుపుకుంటారు..
  • వీరిని పూజిస్తే రాముడు ఆనందపడతారంట..
Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు రాముడి కన్న ముందు వీరిని పూజించాలంటా.. ఈ రహస్యం మీకు తెలుసా..?

Devotees Must Offer Special Puja To Dasharatha And Kaushalya Devi: శ్రీరామ నవమి వేడుకలను ప్రజలంతా ఎంతో భక్తి భావనలతో జరుకుంటారు. శ్రీరామ నవమి పండగ కోసం ప్రజలంతా ఎంతో వేడుకగా ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. ఈరోజున ఉదయాన్నే నిద్రలేచీ ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. అదే విధంగా దేవుడిగుడిని, ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీరాముడు చైత్రశుధ్ద నవమి, పునర్వసు నక్షత్రంలో ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు జన్మించాడు. అయితే.. అనేక చోట్ల గుడులలో ఈరోజు రాముల వారి కళ్యాణం, జన్మదినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరిపిస్తారు. శ్రీరాముడి కళ్యాణాన్ని ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ప్రజలంతా బెల్లం పానకం నైవేద్యం చేస్తారు.

Read More: Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?

ప్రతి ఇంట్లో రాముల వారి చిత్రపటాలకు ప్రత్యేకంగా అలం కరణచేస్తారు. ఒక నామం ఒకే బాణం అనే రాముల వారి మాటలతో ప్రజలంతా ఎంతో వేడుకగా రాముల వారిని కోలుచుకుంటారు. ఇదిలా ఉండగా ముఖ్యంగా శ్రీరామనవమి రోజున శ్రీరాముడితో పాటు, దశరథుడు, కౌసల్య దేవీలను పూజిస్తే ఎంతో ఆనందిస్తాడంట. దశరథుడు చిన్నతనంలో రాముడ్ని ఎంతో అల్లారుముద్దుగా చూసుకునే వాడంటా. ఒక నిముషంరాముడు కన్పించకుండా దశరథుడు విలవిల్లాడిపోయేవాడంట. అందుకు ఎప్పుడు కూడా రాముడ్ని అంటిపెట్టుకునే ఉండేవాడంట.

అంతటి ప్రేమానురాగాలు కల్గి ఉన్న రాముడ్ని దశరథుడు, అరణ్యవాసం గురించి చెప్పలేక, తనలోతాను కుమిలిపోయాడు. మంధర మాటలు విని కైకేయి తనమనస్సును చెడుఆలోచనలతో, రామయ్యను అరణ్యానికి పంపమని, భరతుడ్ని పట్టాభిషేకం చేయమని కూడా  భీష్మించుకుని కూర్చుంటుంది. ఇదిలా ఉండగా రాముడు అరణ్యవాసానికి వెళ్లగానే క్రమంగా దశరథుడు మంచం పట్టి కాలం చేయడంజరుగుతుంది.

అయిన కూడా శ్రీరాముడికి తనతల్లిదండ్రులంటే చెప్పలేని అభిమానం, ప్రేమ అందుకే  శ్రీరామనవమి రోజున తప్పకుండా దశరథుడిని, కౌసల్యదేవీలను పూజించాలని చెబుతుంటారు.తల్లిదండ్రులను పూజిస్తే,గౌరవిస్తే తమ బిడ్డలు కూడా ఆనందపడతారు. అదే విధంగా.. శ్రీరామనవమిరోజున రామయ్యతో పాటు దశరథుడు, కౌసల్యాదేవీలను పూజించి వారి ఆశీర్వాదాలను మనం పొందుదాం.

శ్రీరామ నవమి రోజు చదవాల్సిన ముఖ్యమైన స్తోత్రాలు..

శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే..

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘనాథాయ నాథయా సీతాయాం పతయే నమః 

ఆపదామపహర్తరాం ధాతారం సర్వసంపదాం లోకాభి రామం శ్రీరామం భుయో భుయో నమామ్యహాం..

Read More: Sri Rama Navami 2024: శ్రీ రాముడికి ఒక అక్క కూడా ఉంది.. ఆమె గొప్పతనం ఏంటో తెలుసా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News