Ugadi 2022: నూతన తెలుగు పంచాంగం ప్రకారం దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే

Ugadi 2022: తెలుగు ప్రజలకు ఉగాది ఎంతో ప్రత్యేకం. తెలుగు నూతన సంవత్సరం ఈ రోజే ప్రారంభం కావడం ఇందుకు కారణం. ఇదే రోజు పంచాంగం వినడం కూడా ఓ సంప్రదాయంగా వస్తోంది. మరి కొత్త పంచాగం ప్రకారం దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 05:44 PM IST
  • దేశంలో ఈ ఏడాది పరిస్థితులు ఎలా ఉండనున్నాయి?
  • నూతన పంచాంగంలో ఏముంది?
  • క్రీడా రంగంపై ఎలాంటి ప్రభావం పడనుంది?
Ugadi 2022: నూతన తెలుగు పంచాంగం ప్రకారం దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే

Ugadi 2022: తెలుగు నూతన సంవత్సరాది, ఉగాది వచ్చిందంటే.. ముందుగా గుర్తొచ్చేవి పచ్చడి, పంచాంగం. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అని తెలుసుకునేందుకు అందరూ ఎదురు చూస్తుంటారు. మరి ఈ సంవత్సరం (శుభకృత్​) మన దేశంలో పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? ఇతర దేశాలతో సంబందాలపై ఎలాంటి ప్రభావం పడనుంది? అనే విషయాలపై జోతిష్య నిపుణులు పాలెపు రాజేశ్వర శర్మ చెప్పిన వివరాలను ఇప్పుడు చూద్దాం.

కొత్త సంవత్సరం ఎలా ఉండనుందంటే..

భారత్​కు మిత్ర దేశాలు పెరిగే అవకాశముందని చెప్పారు పాలెపు రాజేశ్వర శర్మ. మిత్ర దేశాలు శత్ర దేశాలుగా మారే అవకాశాలు లేవని అంచనా వేశారు. ఇక ప్రపంచపవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే.. విజయవంతంగా ముందుకు సాగుతామని కూడా వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా భవిష్యత్​లో మాత్రం భారత్​కు మిత్ర దేశాలు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు రాజేశ్వర శర్మ. యుద్ధం వంటి పరిస్థితుల నడుమ.. శత్రు దేశాలు పెరగొచ్చని వస్తున్న అంచనాలు సరైనవి కావన్నారు. మిత్ర దేశాలు శాశ్వతంగా ఉంటాయని చెప్పారు. దేశంలో సుభిక్షమైన వాతావరణం ఉంటుందని వివరించారు.

కొత్త సంవత్సరంలో క్రీడా రంగం..

క్రీడా రంగం ఈ ఏడాది విజయవంతంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుతమున్న స్థితికి.. కుజుడికి మంచి తత్వం ఏర్పడిందన్నారు. కుజుడు యవ్వనానికి, పిల్లలకు కారకుండని ఫలితంగా ఈ ఏడాది కొత్త వారికి అవకాశాలు పెరగొచ్చని అంచనా వేశారు. క్రికెట్, హాకీ సహా ఇతర ఆటలన్నింటిలో ఇంతకు ముందు చూడని ప్లేయర్స్​ ప్రభిభకు గుర్తింపు లభిస్తుందన్నారు.

భారత ప్రస్థానం కొత్త క్రీడలకూ విస్తరిస్తుందని అంచనా వేశారాయన. అంతర్జాతీయ పోటీల్లో మన దేశానికి పథకాలు కూడా పెరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also read: Ugadi 2022: కరోనా, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం ముగుస్తుందా.. కొత్త పంచాంగం ఏం చెబుతోంది

Also read: Chaitra Navaratri 2022: చైత్ర నవరాత్రుల ప్రభావం.. ఆ 6 రాశుల వారికి బాగా కలిసొస్తుంది...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News