Varalakshmi Vrat 2022: వరలక్ష్మీ వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ వ్రతాన్ని(Varalakshmi Vratam 2022) ఆగస్టు 12న జరుపుకోనున్నారు. ఈ రోజు లక్ష్మీదేవి యెుక్క వరలక్ష్మీ రూపాన్ని పూజిస్తారు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో బాగా జరుపుకుంటారు.
వరలక్ష్మీ వ్రతం 2022 తేదీ
ఆగస్టు 12న శ్రావణ పూర్ణిమ తిథి ఉదయం 07:05 వరకు ఉంటుంది. అనంతరం ఉదయం నుండి 11:34 వరకు సౌభాగ్య యోగం ఉంటుంది, ఆ తర్వాత శోభనయోగం మెుదలవుతుంది. ఈ రెండు యోగాలు శుభ కార్యాలకు చాలా మంచిది.
పూజ ముహూర్తం
Alsoవరలక్ష్మీ వ్రతానికి చాలా శుభ ముహూర్తాలు ఉన్నాయి. మీకు నచ్చిన సమయంలో పూజలు చేసుకోవచ్చు.
ఉదయం పూజ ముహూర్తం: 06:14 నుండి 08:32 వరకు
మధ్యాహ్నం పూజ ముహూర్తం: 01:07 నుండి 03:26 వరకు
సాయంత్రం పూజ ముహూర్తం: 07:12 నుండి 08:40 వరకు
వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత
సౌత్ ఇండియాలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని బాగా పాటిస్తారు. ఈ రోజున మాతా మహాలక్ష్మి యొక్క వరలక్ష్మి రూపాన్ని పూజిస్తారు. వివాహిత స్త్రీలు ఉండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల ఐశ్వర్యం, సంతానం, సుఖం, సౌభాగ్యం సిద్ధిస్తాయి. ఈ రోజు వరలక్ష్మి దేవినిని పూజించడం వల్ల అష్టలక్ష్మిని పూజించిన పుణ్యం లభిస్తుంది నమ్ముతారు. తల్లి వరలక్ష్మి తన భక్తులకు కీర్తి, బలం, ఆనందం, శాంతి, జ్ఞానం మొదలైన వాటిని ప్రసాదిస్తుంది.
వ్రతం చేయు విధానం
వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకునే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలు రాసి.. తోరణాలతో అలంకరించాలి. ఇంట్లోని పూజ గదిలో ఒక మండపాన్ని సిద్దం చేసుకని...దానిపైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. పీఠంపై అమ్మవారి విగ్రహాన్ని లేదా ఫోటోను ప్రతిష్టించాలి. ముందుగా గణపతిని పూజించాలి. పసుపు, కుంకుమ, తోరాలు, పూలు, అక్షతలు, పళ్లు మెుదలైనవి అమ్మవారికి సమర్పించి పూజ చేయాలి. అనంతరం వ్రత కథ చదివి వినిపించాలి. తర్వాత అక్షతలను శిరస్సుపై చల్లుకుని...ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి.
Also Read: Venus Transit 2022: మరో 4 రోజుల్లో శుక్ర సంచారం.. ఈ 3 రాశులవారికి అంతులేని ఐశ్వర్యం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook