Vastu tips: పూర్వీకుల ఫోటోల్ని ఇంట్లో ఏ దిశలో అమర్చాలి, లేకపోతే ఏం జరగనుంది

Vastu tips: హిందూమత విశ్వాసాల ప్రకారం పితృపక్షం ప్రారంభమైంది. ఈ సమయంలో పూర్వీకుల్ని స్మరించుకుంటే అంతా మంచి జరుగుతుందనేది ఓ నమ్మకం. అదే సమయంలో వాస్తు ప్రకారం కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 1, 2023, 09:44 AM IST
Vastu tips: పూర్వీకుల ఫోటోల్ని ఇంట్లో ఏ దిశలో అమర్చాలి, లేకపోతే ఏం జరగనుంది

Vastu tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉన్నట్టే వాస్తు శాస్త్రానికి కూడా విశిష్టత ఉంది. వాస్తు ప్రకారం ఏవి ఎక్కడ అమర్చాలో అక్కడ ఉండాలి. ముఖ్యంగా పితృ పక్షం ప్రారంభమైనందున రోజూ క్రమం తప్పకుండా పూర్వీకుల్ని స్మరించుకుంటే అమితమైన ప్రయోజనాలు కలగనున్నాయంటారు. 

హిందూమతంలో పితృపక్షంలోని 15 రోజుల సమయంలో పూర్వీకులు సంచరిస్తారని ప్రతీతి. ఈ సమయంలో పూర్వీకుల ఆత్మ శాంతికి తర్పణం, శ్రద్ధ, పిండదానం చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మంచి జరుగుతుందంటారు. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మ శాంతించి..కుటుంంబీకుల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం. అదే సమయంలో పూర్వీకుల పోటోలకు మహత్యముంటుంది. వాటిని వాస్తు ప్రకారం సరైన దిశలో అమర్చితే అంతా మంచి జరుగుతుందంటారు. అదే తప్పుడు ప్రదేశాల్లో పూర్వీకుల ఫోటోలు అమర్చితే జీవితంలో కష్టాలు పెరిగిపోగలవు,. ఈ క్రమంలో వాస్తు ప్రకారం పూర్వీకుల ఫోటోలు ఎలా అమర్చాలనేది తెలుసుకుందాం..

పూర్వీకుల ఫోటోల్ని ఇంట్లో హాలు, లేదా మెయిన్ రూమ్ సౌత్-వెస్ట్ లేదా పశ్చిమ దిశలో అమర్చితే ఎక్కువ ప్రయోజనముంటుంది. ఎందుకంటే దక్షిణ దిశను పూర్వీకుల దిశగా పరిగణిస్తారు. తూర్పు లేదా ఈశాన్య దిశలో పూర్వీకుల ఫోటోలు అమర్చితే సమస్యలు చుట్టుముడతాయంటారు. ఎందుకంటే ఇది దేవీ దేవతల దిశ. దేవతల ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది.

పూర్వీకులు కూడా దేవతల్లానే శక్తిమంతులని అంటారు. కానీ దేవతల్ని పూజించే స్థలంలో పూర్వీకుల ఫోటోలు పొరపాటున కూడా పెట్టకూడదు. దీనివల్ల ఇంట్లో అతి పెద్ద వాస్తు దోషం ఏర్పడవచ్చు. పూర్వీకుల ఫోటోల్ని ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంచాలి. పూర్వీకుల ఫోటోలు అమర్చేటప్పుడు ఆ ఫోటోలు వేలాడుతూ లేదా కదులుతూ ఉండకుండా చూసుకోవాలి. పూర్వీకుల ఫోటోలపై దుమ్ము ధూళి పేరకుండా చూసుకోవాలి. పూర్వీకుల ఫోటోల్ని ఇంట్లో మర్యాదపూర్వకంగా, సరైన దిశలో ఉంచాలి. పూర్వీకుల ఫోటోలకు వేసే దండ పాడవకుండా ఉండాలి. ఎప్పటికప్పుడు మారుస్తుండాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం పూర్వీకుల ఫోటోల్ని కిచెన్, బెడ్రూమ్,, మెట్ల వద్ద ఉంచకూడదంటారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో విబేధాలు పెరిగిపోతాయని నమ్మకం. ఇంట్లో అశాంతి రాజ్యమేలవచ్చు. గొడవలకు దారితీసే పరిస్థితులుంటాయి. అదే సమయంలో పూర్వీకుల ఫోటోల్ని బతికున్నవారి ఫోటోలతో కలిపి ఉంచకూడదు. ఇది అశుభానికి సంకేతం. జీవించి ఉండేవారితో కలిపి అమర్చితే ఆయుష్షు తగ్గిపోతుందంటారు

Also read: Solar Eclipse 2023: ఈ ఏడాదిలో చివరి సూర్య గ్రహణం ఎప్పుడు, సూతక కాలం భారత్‌లో ఉందా లేదా, ఏ రాశులపై ప్రభావం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News