Vastu Tips: ఇంట్లో ఆ విగ్రహాన్ని సరైన దిశలో ఉంచితే..అద్భుతం కన్పిస్తుంది

Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టిన ప్రతి వస్తువు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ధన సంపదలు కలగడమే కాకుండా ఆ వ్యక్తికి గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి. అటువంటి ఆ విగ్రహాన్ని ఇంట్లో పెడితే..ఆ వ్యక్తికి ఇక తిరుగుండదంట.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 18, 2022, 04:30 PM IST
Vastu Tips: ఇంట్లో ఆ విగ్రహాన్ని సరైన దిశలో ఉంచితే..అద్భుతం కన్పిస్తుంది

Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టిన ప్రతి వస్తువు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ధన సంపదలు కలగడమే కాకుండా ఆ వ్యక్తికి గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి. అటువంటి ఆ విగ్రహాన్ని ఇంట్లో పెడితే..ఆ వ్యక్తికి ఇక తిరుగుండదంట.

జీవితంలో పాజిటివిటీ కోసం వాస్తుశాస్త్రంలో చాలా వస్తువుల గురించి ప్రస్తావన ఉంది. ఒకవేళ ఈ వస్తువుల్ని ఇంట్లో సరైన దిశలో, సరైన ప్రదేశంలో ఉంచితే..ఆ వ్యక్తికి చాలా లాభాలు కలుగుతాయి. వాస్తుశాస్త్రంలో అటువంటిదే ఓ సింహం విగ్రహం గురించి ప్రస్తావన ఉంది. దీనివల్ల ఆ వ్యక్తి ఆత్మ విశ్వాసం సమృద్ధిగా ఉండటమే కాకుండా..కుటుంబసభ్యులు అభివృద్ధి చెందుతారు. ధన సంపదలకు కొత్త మార్గాలు తెర్చుకుంటాయి.

బలహీనమైన ఆత్మ విశ్వాసం ఎవరినైనా సరే పతనం వైపుకు తీసుకెళ్తుంది. ఈ పరిస్థితుల్లో ఏదో విధంగా వ్యక్తి ఆత్మ విశ్వాసం పెంచాల్సిన అవసరముంది. దీనికోసం వాస్తుశాస్త్రంలో ఇత్తడి సింహం విగ్రహం అమర్చాలని వాస్తుపండితులు సలహా ఇస్తున్నారు. వాస్తుపండితుల ప్రకారం ఇంట్లో సింహం విగ్రహాన్ని సరైన దిశలో సరైన స్థానంలో ఉంచితే..ఆ వ్యక్తిలో ఊహించని మార్పు కన్పిస్తుంది. అతని ఆత్మ విశ్వాసం అచంచలంగా పెరుగుతుంది. ఇంట్లో కుటుంబసభ్యుల్లో సుఖ సంతోషాలు కొనసాగుతాయి. డబ్బులు వస్తుంటాయి.

ఆత్మవిశ్వాసం తిరిగి పొందేందుకు లేదా బలోపేతం చేసేందుకు ఇంట్లో ఇత్తడి సింహం విగ్రహం ఉండాల్సిందేనంటున్నారు పండితులు. సింహం ఆత్మ విశ్వాసానికి, శక్తికి ప్రతీక. అందుకే ఇంటిలోపల ఉత్తర దిశలో లేదా నార్త్ ఈస్ట్ దిశలో విగ్రహాన్ని ఉంచాలి. ఆ తరువాత జరిగే అద్భుతం మీరే చూస్తారు. ఆ వ్యక్తి ఆత్మ విశ్వాసం బాగా పెరుగుతుంది. ఇంట్లో సిహం విగ్రహం ఉంచే సమయంలో..సింహం ముఖం ఇంటి మధ్యభాగంలో ఉండేట్టు చూసుకోవాలి.

వాస్తు పండితుల ప్రకారం ఇంట్లో సింహం విగ్రహం ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అటు కుటుంబసభ్యుల్లో ఐకమత్యపు భావన పెరుగుతుంది. ఇంటి కుటుంబసభ్యుల్లో కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన కలుగుతుంది. సింహం విగ్రహం వల్ల వ్యక్తిలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అటు ఈ విగ్రహం కారణంగా కుటుంబసభ్యులు పటిష్టమౌతారు. మనసులో మరొకరిపట్ల చులకన భావముండదు. 

Also read: Saturn Effect: శని తిరోగమన ప్రభావం...ఏ రాశులకు సంపద సృష్టించనుంది, ఎప్పటి నుంచి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News