Venus Transit: మేషరాశిలోకి శుక్రుడు, ఆ ఐదు రాశులకు మహర్దశే మరి

Venus Transit: ఆ ఐదు రాశులవారికి మే 23 నుంచి విధి మారనుంది. అదృష్టం వరించనుంది. శుక్ర గ్రహం దిశ మారుతుండటంతో ఆ రాశులవారికి మహర్ధశ పడుతోందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఇంతకీ ఆ ఐదు రాశులేంటంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 19, 2022, 09:26 AM IST
 Venus Transit: మేషరాశిలోకి శుక్రుడు, ఆ ఐదు రాశులకు మహర్దశే మరి

Venus Transit: ఆ ఐదు రాశులవారికి మే 23 నుంచి విధి మారనుంది. అదృష్టం వరించనుంది. శుక్ర గ్రహం దిశ మారుతుండటంతో ఆ రాశులవారికి మహర్ధశ పడుతోందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఇంతకీ ఆ ఐదు రాశులేంటంటే..

గ్రహాల కదలిక, నక్షత్రాల పరివర్తనం కారణంగా రాశిఫలాలు మారుతుంటాయనేది జ్యోతిష్యశాస్త్రం చెబుతున్న మాట. ఇప్పుడు శుక్రగ్రహం దిశ మారుతుండటంతో మే 23 నుంచి ఐదు రాశులవారికి మహర్దశ పట్టనుంది. శుక్రగ్రహం మే 23 నుంచి మీనరాశిని వదిలి..మేషరాశిలో ప్రవేశించనున్నాడు. వాస్తవానికి శుక్రగ్రహాన్ని అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. శుక్రగ్రహం ఎప్పుడు తన రాశిలో తిరుగుతున్నా..మిగిలిన అన్ని రాశులపై ఆ ప్రభావం పడుతుంటుంది. ఈ పరివర్తనం కారణంగా అదృష్టం తన్నుకుని వస్తుంటుంది. చాలామంది జీవితాల్లో మార్పు వస్తుంటుంది. ఈసారి శుక్రదేవుడు మే 23 నుంచి మీనరాశిని వదిలి..మేషరాశిలో మారనుంది. ఈ పరిణామం కారణంగా ఏ రాశులపై ప్రభావం ఎలా పడుతుందో చూద్దాం..

ఆర్ధిక పరిస్థితిలో మెరుగుదల

ధనస్సురాశివారికి బాగుంటుంది. లావాదేవీలకు అనుకూలమైన సమయం. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు కూడా మంచి సమయం. ఆదాయమార్గాల్లో వృద్ధి కన్పిస్తుంది కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. 

మేషరాశివారికి అదృష్టమే అదృష్టం. లక్ష్మీదేవి కటాక్షంతో జీవితమంతా ఆనందంగా ఉంటుంది. ఆర్ధిక విషయాలు పటిష్టంగా ఉంటాయి. పెట్టుబడులకు అనువైన సమయం. ఖర్చులు కూడా తగ్గడంతో ఆర్ధికంగా ఇబ్బందులుండవు. కుటుంబ సంబంధాలు కూడా బాగుంటాయి.

వృశ్చికరాశివారికి చాలా మంచి సమయం. లక్ష్మీదేవి కటాక్షంతో చేసే పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపారాలకు అనువైందిగా చెబుతున్నారు. ఆర్ధికంగా లాభాలున్నా..ఖర్చులు మాత్రం తగ్గించుకోవల్సి వస్తుంది. కొత్త ఇళ్లు లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుంభరాశివారికి లక్ష్మీదేవి ప్రత్యేక దయ ఉంటుంది. వ్యాపారవర్గాలకు ఈ సమయం ఓ వరం లాంటిది. పెట్టుబడులకు చాలా అనువైన సమయం. కొత్త వాహనాలు లేదా ఇళ్లు కొనుగోలు చేయవచ్చు. ఖర్చులు మాత్రం చాలావరకూ తగ్గించుకోవల్సి ఉంటుంది. 

మిధునరాశివారికి కూడా చాలా అనువైనది. కానీ లావాదేవీల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. లక్ష్మిదేవి కటాక్షం పూర్తిగా ప్రాప్తిస్తుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులు చేయడానికి అనువైన సమయం. కొత్త ఇళ్లు లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు.

Also read: Spiritual Importance of Thursday: గురువారం వివాహిత స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయకూడదు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News