Wednesday Remedies: చేపట్టే పనులన్నీ నిలిచిపోతుంటే, ఏ పనీ జరగకపోతే ఇలా చేయండి చాలు

Wednesday Remedies: జ్యోతిష్యశాస్త్రంలో చాలా అంశాలకు ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేస్తే ఏమౌతుందనే విషయంలో కొన్ని సూచనలు, నియమ నిబంధనలున్నాయి. ఆ వివరాలు పూర్తిగా మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 19, 2023, 03:37 AM IST
Wednesday Remedies: చేపట్టే పనులన్నీ నిలిచిపోతుంటే, ఏ పనీ జరగకపోతే ఇలా చేయండి చాలు

Wednesday Remedies: హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి అంశానికి ఓ కారణం, ఓ ప్రాశస్త్యం, ఓ విశిష్టత ఉన్నాయి. జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల పనుల్లో ఏదైనా సమస్య లేదా ఆటంకం పదే పదే ఏర్పడుతుంటే అశుభమని అర్దం చేసుకోవాలి. అంటే జరిగే పని కూడా నిలిచిపోవడాన్ని దురదృష్టంగా భావిస్తారు. 

హిందూమతంలో బుధవారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి బుధవారం నాడు 5 విశేష
ఉపాయాగుల ఆచరించడం ద్వారా ఆటంకాలను ఎదుర్కోవచ్చు. ఈ ఉపాయాలు పాటించడం ద్వారా గణేశుడి ప్రసన్నత లభిస్తుందని అంచనా. హిందూ మతం ప్రకారం గణేశుడు తొలి ఆరాధ్య దైవం. ముందుగా గణేష్ పూజలతోనే ఇతర పూజలకు ప్రారంభం కావచ్చు. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు గణేశుడి పూజతోనే ప్రారంభిస్తుంటారు. బుధవారం గణపతికి ప్రియమైన రోజు. అందుకే  రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఎవరైనా వ్యక్తి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ప్రితి బుధవారం నాడు గణేశుడికి సంబంధించి 5 ముఖ్యమైన ఉపాయాలు పాటించాల్సి ఉంటుంది.

ఒకవేళ మీపై అప్పు పెరిగిపోయుంటే..బుధవారం నాడు కొద్దిగా పెసలు ఉడకబెట్టాలి. ఆ తరువాత ఇందులో పంచదార, నెయ్యి కలిపి ఆవుకు తిన్పించాలి. ఇలా వరుసగా 7 బుధవారాలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. 7 బుధవారాలు ఈ ఉపాయాన్ని ఆచరించవచ్చు. ఒకవేళ మీ పిల్లలు చదువులు వెనుకబడితే లేదా పోటీ పరీక్షల్లో ఆశించిన విజయం లభించకపోయినా బుధవారం నాడు నిర్ణీత పద్ధతిలో గణేశుడిని పూజించాలి. ఓం గం గణపతయే నమం జంపం ఆచరించి అదే మంత్రాన్ని రాత్రి పఠించాలి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల బుద్ధి వికసితమౌతుంది. చదువులో సక్సెస్ లభిస్తుంది.

గణేశుడికి పచ్చ రంగు అంటే ఇష్టమట. అందుకే ఒకవేళ కుండలిలో బుధుడు బలహీనంగా ఉంటే బలోపేతం చేసేందుకు మీ వద్ద ఎప్పుడూ పచ్చరంగు రుమాలు ఉంచుకోవాలంటున్నారు. దాంతోపాటు బుధవారం నాడు ఎవరైనా ఆపన్నుడికి పచ్చ బట్టలు లేదా పెసలు సమర్పించాలి. హిందూ శాస్త్రాల ప్రకారం గణేశుడికి మోదక్ లేదా లడ్డూ అత్యంత ఇష్టమంటారు. క్రమం తప్పకుండా గణేశుడిని పూజిస్తే అతడిపై మోదక్ తప్పకుండా ప్రసాదంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీకు ఎదురయ్యే ఆటంకాలు ఏర్పడతాయి.

Also read: Pregnancy Care: గర్భిణీ మహిళలు దూరంగా ఉండాల్సిన బ్యూటీ కేర్ ఉత్పత్తులు ఇవే, తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News