Weekly Horoscope 13-19 August 2023: ఈ వారం జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ సంచార ప్రభావం కొన్ని రాశులవారిపై పడి వారపు జాతకాల్లో మార్పులు జరిగాయి. అయితే ఈ సంచారంతో కొన్ని రాశులవారికి సామాజికంగా, రాజకీయ రంగాల్లో చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రాశులవారు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వారంలో ఏయే రాశులవారు వారు ఎలాంటి ప్రయోజనాలు పొందబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశివారికి ఈ వారం అద్భుతంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీరు కొన్ని ప్రత్యేక పనుల కారణంగా విదేశాలకు కూడా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వారం కుటుంబంలో శుభ కార్యాలు జరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో మీ ఇంటికీ అతిథితులు కూడా రావచ్చు. దీంతో కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ వారం మీరు భూములు కొనుగోలు కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు ప్రారంభించే క్రమంలో పెట్టుబడులు కూడా పెట్టే ఛాన్స్‌లు ఉన్నాయి.
మిథున రాశి:
ఈ వారం మిథున రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరు పాత వివాదాల నుంచి సులభంగా బయటపడతారు. దీని కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా మిథున రాశివారు ఈ వారం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొంతమందైతే భూములతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించి వ్యాపారాల నుంచి అధిక మొత్తంలో డబ్బులు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరు కుటుంబ సభ్యులతో కలసి విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..
మేష రాశి:
మేష రాశి వారు ఈ వారం వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కుటుంబ వివాదంలో చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీ కుటుంబం మీకు వ్యతిరేకంగా మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో వారిని ఆనందంగా ఉంచేందుకు కుటుంబంతో కలసి యాత్రలకు వెళ్లడం వల్ల మంచి ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సామాజిక, రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీపై కుట్రలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి