Lucky Moles: మానవ శరీరంపై పుట్టుమచ్చలు చాలా విషయాలు చెబుతాయి. జోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన భవిష్యత్తు, వారి స్వభావం, వారు ఎదుర్కొనే వ్యాధుల గురించి కూడా శరీరంపై ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా తెలుసుకోవచ్చు.
అయితే ఈ పుట్టుమచ్చల ద్వారానే ప్రతి వ్యక్తికి కలిగే అదృష్టాన్ని తెలుసుకుంటారు. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం శరీరంలోని ఏ భాగంలో పుట్టుమచ్చ ఉంటే మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
1) చెంపపై పుట్టుమచ్చ
చెంపపై పుట్టుమచ్చ ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో చాలా మంచి జరుగుతుంది. చెంప మీద పుట్టుమచ్చలు ఉన్నవారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. డబ్బు విషయంలో కూడా చాలా అదృష్టవంతులు. అలాంటి వారు జీవితాంతం ధనవంతులుగా ఉంటారు.
2) శరీరంపై ఎర్రటి మచ్చలు
శరీరంలోని ఏ భాగంలోనైనా ఎర్రటి మచ్చ ఉండటం మంచిది కాదు. అలాంటివి శరీరంలో నొప్పిని సూచిస్తుంది. శరీరంపై ఎర్రటి మచ్చలు ఉన్నవారికి ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి వారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
3) నుదుటిపై పుట్టుమచ్చ
నుదిటిపై పుట్టుమచ్చలు ఉన్నవారు మరింత తెలివిగా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చాకచక్యంగా వ్యవహరిస్తారు.
4) చేతిలో పుట్టుమచ్చ
చేతిలో పుట్టుమచ్చలు ఉన్నవారికి డబ్బుకు లోటు ఉండదు. వారికి ఎక్కువ డబ్బు ఉండడం సహా డబ్బును పొదుపు చేయడంలో వీరు సిద్ధహస్తులు.
5) ఉదరంపై పుట్టుమచ్చలు
పొట్ట(ఉదరం)పై పుట్టుమచ్చలు ఉన్నవారికి ఆహారపుటలవాట్లు (తిండిబోతులు) ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని.. రుచికరమైన ఆహారాన్ని ప్రతిసారి ఆస్వాదించాలనే కోరికతో ఉంటారు.
6) వేళ్లపై పుట్టుమచ్చలు
ఉంగరపు వేలులోని రెండో భాగంలో పుట్టుమచ్చలు కలిగిన వారు.. సంబంధాల్లో బలహీనంగా ఉంటారు. అంటే ఎక్కువ కాలం ఎవరితోనూ సంబంధాన్ని కొనసాగించలేరు. సులభంగా బంధాలను తెంచుకొని జీవితంలో ముందుకు సాగుతారు.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జోతిష్య, పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా పొందుపరిచినది. దీన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరించడం లేదు.)
Also Read: Garuda puranam: గరుడ పురాణం రహస్యం.. ఇలాంటి వాళ్లకు లక్ష్మీ కటాక్షం చాలా ఉంటుందట..!!
Also Read: Horoscope January 17 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శుభవార్త వింటారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook