Afghanistan Beat Netherlands by 7 Wickets: వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ రేసులోకి దూసుకువచ్చింది అప్గానిస్థాన్. శుక్రవారం నెదర్లాండ్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. ఈ ప్రపంచకప్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. 46.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం అప్గాన్ జట్టు కేవలం 31.3 ఓవర్లలో మూడు వికెట్లు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో అఫ్గానిస్థాన్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి చేరింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో నెదర్లాండ్స్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అఫ్గాన్ బౌలర్ల ధాటికి 46.3 ఓవర్లలో 179 పరుగులకు కుప్పకూలింది. మ్యాక్స్ ఓడ్వోడ్ (42), అకెర్మాన్ (29), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (58) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఫీల్డింగ్‌లో అదరగొట్టింది. ఏకంగా నలుగురు బ్యాట్స్‌మెన్లను రనౌట్ రూపంలో పెవిలియన్‌కు పంపించారు. మహ్మద్ నబీ 3 వికెట్లు తీయగా. నూర్ అహ్మద్ 2 వికెట్లు పడొట్టాడు. మరో వికెట్ ముజీబ్‌కు దక్కింది.
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్.. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (10), ఇబ్రహీం జద్రాన్ (20) తర్వగా ఔట్ అయినా తరువాత పుంజుకుంది. రహ్మత్ షా 54 బంతుల్లో 8 బౌండరీలతో 52 పరుగులు, కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అజేయంగా 56 పరుగులతో జట్టును గెలిపించారు. ఒమర్జాయ్ 28 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు మహమ్మద్ నబీకి దక్కింది. అఫ్గానిస్థాన్ తరువాత మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో తలపడనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను ఓడించిన అఫ్గాన్.. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే తొలిసారి వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
Also Read: Mega Brothers Photo: ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ.. కూల్ లుక్‌లో మెగా బ్రదర్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి