ఫిఫా ప్రపంచకప్ 2018 క్వార్టర్ ఫైనల్స్ ముగిశాయి. ఫ్రాన్స్, బెల్జియం, ఇంగ్లాండ్, క్రొయేషియా జట్లు సెమీస్ చేరుకున్నాయి.
సెమీస్‌కు చేరిన ఇంగ్లాండ్
ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు గెలుపొంది.. సెమీస్‌కు చేరింది. స్వీడన్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 2-0 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ జట్టు సెమీస్‌కు చేరుకోగా.. స్వీడన్ జట్టు మాత్రం ఇంటిబాట పట్టింది.
సెమీస్‌కు చేరిన ఫ్రాన్స్
ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా ఫ్రాన్స్ vs ఉరుగ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు గెలుపొంది సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి ఉరుగ్వే ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఫ్రాన్స్ జట్టు మాత్రం రెండు గోల్స్ చేసి 2-0 తేడాతో ఉరుగ్వేపై ఫ్రాన్స్ గెలుపొందింది.
సెమీస్‌కు చేరిన బెల్జియం
రికార్డు స్థాయిలో 5సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ జట్టుకు క్వార్టర్ ఫైనల్లో అనుకోని షాక్ తగిలింది. బెల్జియం జట్టు చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2014లో సొంతగడ్డపై సెమీస్‌లో జర్మనీ చేతిలో 7-1 తేడాతో ఓడిన బ్రెజిల్ టోర్నీ నుంచి వైదొలగగా.. 2018లో క్వార్టర్స్‌లోనే బ్రెజిల్ ఇంటిబాట పట్టింది.
20 ఏళ్ల తరువాత సెమీస్‌కు చేరిన క్రొయేషియా
ఫిఫా ప్రపంచకప్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించిన క్రొయేషియా జట్టు.. 20 ఏళ్ల తరువాత సెమీస్‌కు చేరుకుంది. శనివారం క్రోయేషియాతో జరిగిన నాలుగో క్వార్టర్ ఫైనల్స్‌లో రష్యా పెనాల్టీ షూటౌట్‌లో 4-3 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది.
పిఫా సెమీ ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యుల్
- ఈ నెల 10న ఫ్రాన్స్ వర్సెస్ బెల్జియం(రాత్రి 11:30 గంటలకు మ్యాచ్)
- ఈ నెల 11న క్రొయేషియా వర్సెస్ ఇంగ్లాండ్ (రాత్రి 11:30 గంటలకు మ్యాచ్)
కాగా ఈనెల 14న మూడోస్థానం కోసం ప్లే ఆఫ్ మ్యాచ్, 15న ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.