Harbhajan Singh: ఛాతిపై టాటూ వేసుకుని...రజనీకి బర్త్ డే విషెస్ చెప్పిన టీమిండియా క్రికెటర్

Harbhajan Singh: టీమిండియా క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌...సూపర్ స్టార్ రజనీకాంత్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.తలైవా పుట్టినరోజు సందర్భంగా..ఆయన టాటూను తన ఛాతిపై వేసుకున్నాడు భజ్జీ.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 06:17 PM IST
Harbhajan Singh: ఛాతిపై టాటూ వేసుకుని...రజనీకి బర్త్ డే విషెస్ చెప్పిన టీమిండియా క్రికెటర్

Harbhajan Singh Rajinikanth Tatoo:  నేడు(డిసెంబరు 12) సూపర్ స్టార్ రజనీకాంత్ 71వ పుట్టినరోజు(71st birthday of Rajinikanth). ఈ సందర్భంగా టీమిండియా స్పిన్నర్  హర్భజన్‌ సింగ్‌(Harbhajan Singh)...రజనీ(Superstar Rajinikanth)కి వినూత్న శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. తలైవా టాటూను తన ఛాతీపై వేసుకుని  బర్త్‌ డే విషెస్‌ చెప్పాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 

 ‘నా ఛాతీపై  సూపర్ స్టార్‌ను కలిగి ఉన్నాను.  మీరు 80వ దశకంలో బిల్లాగా.. 90లలో బాషాగా.. ఇటీవలి కాలంలో అన్నాత్తేగా అలరించారు.. సినీ రంగంలో ఏకైక సూపర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అంటూ తమిళ్‌లో రాసుకొచ్చాడు. రజనీ కాంత్ 2016లో పద్మవిభూషణ్ పురస్కారం(Padma Vibhushan award) అందుకున్నారు. తలైవా ఇప్పటివరకు 163 సినిమాల్లో నటించాడు. 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3)

Also Read: Virat Kohli - Anushka Sharma: నాలుగేళ్లుగా నేను వేసిన సిల్లీ జోక్‌లను భరించావ్.. ఎంత చికాకుగా ఉన్నా ప్రేమించావ్: కోహ్లీ

హర్భజన్ ట్వీట్ చూసి..రజినీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. భజ్జీ షేర్‌ చేసిన ఫోటోను లైకులు, షేర్లతో మోతెక్కిస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజాలలో హర్భజన్ సింగ్ ఒకరు. ఈ బౌలింగ్ లెజెండ్ భారత్ తరఫున టెస్టుల్లో 417 వికెట్లు, వన్డే ఫార్మాట్‌లో 269 వికెట్లు పడగొట్టాడు. 2015లో భారత్ తరుపున తన చివరి మ్యాచ్ ను ఆడాడు. 

Also Read: Venkatesh Iyer: అభిమానం అంటే ఇదేమరి.. రజనీకాంత్ స్టైల్‌లో సంబరాలు చేసుకున్న వెంకటేష్! మాములుగా లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

 

Trending News