ICC Test Ranking Updates: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు. స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో రాణించడం ద్వారా భారత క్రికెటర్లు తమ స్థానాలను భారీగా మెరుగుపరుచుకున్నారు. ఇవాళ రిలీజ్ చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బౌలర్ల లిస్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంకు దక్కించుకున్నాడు. ఇన్నాళ్లూ అగ్రస్థానంలో కొనసాగిన భారత స్టార్ పేసర్ బుమ్రా రెండో ర్యాంకుకు పడిపోయాడు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా బుమ్రాతో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్ తో సిరీస్ లో అశ్విన్ 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఈ సిరీస్ లో వందో టెస్టు కూడా ఆడాడు. అంతేకాకుండా ఇదే టెస్టులో ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా దిగ్గజాల సరసన నిలిచాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో 26 వికెట్లుతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. మరోవైపు బుమ్రా 19 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో జడేజా బంతితోపాటు బ్యాట్ తోనూ రాణించాడు. దీంతో అతడు ఆల్ రౌండర్ల జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు.
టాప్ 10లోకి దూసుకొచ్చిన రోహిత్
మరోవైపు బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ధర్మశాల టెస్టులో సెంచరీ చేయడం ద్వారా హిట్ మ్యాన్ ఐదు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకు దక్కించుకున్నాడు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ కు చేరుకున్నాడు. ఇతడు రెండు స్థానాలు ముందుకు జరిగి ఎనిమిదో ర్యాంక్ కు చేరుకున్నాడు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కూడా కెరీర్ లో బెస్ట్ ర్యాంక్ అయిన 20వ ర్యాంకు లభించింది. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో కేన్ విలియమ్సన్ అగ్రస్థానం దక్కించుకున్నాడు.
నంబర్ వన్ గా టీమిండియా
భారత జట్టు టెస్టు ర్యాంకింగ్స్ తోపాటు వన్డే, టీ20ల్లోనూ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోంది. డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లోనూ ఇండియా టాప్ లో ఉంది. 68.51 గెలుపు శాతంతో 74 పాయింట్లు సాధించి రోహిత్ స్థానంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. డబ్ల్యూటీసీలో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఆరింట్లో గెలిచి, రెండింట్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. ఇక రెండో స్థానంలో ఉన్న కివీస్ 60 విజయ శాతంతో 36 పాయింట్లు సాధించింది.
Also Read: Ranji Trophy final: సచిన్ రికార్డును మడతెట్టేసిన సర్ఫరాజ్ తమ్ముడు.. ఇంతకీ ఏంటా రికార్డు?
Also Read: IPL 2024: ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. ఐపీఎల్ కు టీ20కా బాప్ దూరం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook