KT Rama RaoPress Meet: అసెంబ్లీ బయట మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్, ప్రియాంక గాంధీకి ఒక రూల్.. తమకు ఒక రూలా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vemula Prashanth Reddy Slams To Revanth Reddy: హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ రెడ్డి చిల్లర దౌర్జన్యకాండ చేశాడని మండిపడ్డారు.
Harish Rao Dare Challenge To Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు. దమ్ముంటే నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఛాలెంజ్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాఇయ.
BRS Party No Entry To Konda Surekha: తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురయిన మాజీ మంత్రి కొండా సురేఖను తమ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కొండా సురేఖ అంశంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
KTR Announces Padayatra After September 14th: తన తండ్రి కేసీఆర్ మాదిరి తాను కూడా రైతుల కోసం పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సాగునీటి విడుదలపై క్యాలెండర్ విడుదల చేయకపోతే సెప్టెంబర్ 14 తర్వాత వేలాది రైతులతో పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు.
BRS Party Protest With Donkeys: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ రింగ్ రోడ్డులో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం వినూత్నంగా జరిగింది. రేవంత్ పాలనతో గాడిద గుడ్డు మిగిలింది అనే అర్థం వచ్చేలా గాడిదలకు బోర్డు తగిలించి ప్రదర్శించారు.
Malla Reddy Mass Dance: కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి, బోడుప్పల్లో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొని హంగామా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాట పెట్టి మాస్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
BRS Party Leaders Chants Govinda Govinda: రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పరిపాలనతో ప్రజలకు నరకప్రాయంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్లు పద్మారావు గౌడ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫలమండి చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 420 హామీలపై గోవింద గోవిందా అంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
Harish Rao Alleges Revanth Reddy: అన్ని వర్గాలతోపాటు దివ్యాంగులను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. పింఛన్లు పెంచుతామని చెప్పి ఒక్కొక్క దివ్యాంగుడికి రేవంత్ రెడ్డి రూ.66 వేలు బాకీ పడ్డాడని తెలిపారు. వెంటనే వారి పింఛన్లు పెంచాలని డిమాండ్ చేశారు.
Sisters Tie Rakhi To Malla Reddy: రక్షాబంధన్ పురస్కరించుకొని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలకు మహిళలు రాఖీలు కట్టించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ... 'రక్షాబంధన్ అన్నాచెల్లెలు, అక్క తమ్ముడు మధ్య ఉన్న గొప్ప వారధి. నాకు మా సోదరీమణులంటే ఎంతో ఇష్టం' అని తెలిపారు.
Grand Celebration Raksha Bandhan In Telangana: తెలంగాణలో రాఖీ పండుగ ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయంగా జరిగింది. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి కలిగిన తెలంగాణలో పెద్ద ఎత్తున రాఖీ పండుగ జరిగింది. అయితే ముఖ్యమంత్రితోపాటు పలువురు ప్రముఖులు కూడా రాఖీ పండుగలో పాల్గొన్నారు.
BRS Party One Week Schedule Against Revanth Reddy Completes 1000 Days Govt: గద్దెనెక్కి రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భారీ కార్యాచరణ చేపట్టింది. అడ్డగోలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదని.. ప్రజలను నిండా మోసం చేశారని ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఉద్యమ షెడ్యూల్ ప్రకటించింది.
Harish Rao Arrest In Hanamakonda: ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ హన్మకొండలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి అరెస్ట్‌ను ప్రభుత్వ ఉద్యోగులతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసులు అమానుషంగా వ్యవహరించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Harish Rao Slams And Fire On Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఉద్యమం చేపట్టగా.. వారికి సంబంధించిన కరువు భత్యం (డీఏలు) ఆరు బకాయిపడడం దేశ చరిత్రలో ఒక రికార్డుగా పరిగణిస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు చెబుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kavitha Serious Allegations On Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావుపై మరోసారి మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని.. గుంపుమేస్త్రీ, బీజేపీతో దోస్తానా? చేస్తున్నారని మండిపడ్డారు. లండన్‌లో మిలాఖత్ అయ్యారని విమర్శించారు.
Telangana MLC Naveen Kumar Reddy: తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్సీ డాక్టర్ శరవణ వీఐబీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో ప్రముఖులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.
Harish Rao Demands Immediately Cancel 22A List: ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే 22ఏను ఎత్తివేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హెచ్చరించారు. అధికారులు చేసిన తప్పు వెనుక దాక్కుని రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
From September 2nd BRS Party One Week Protest For 1000 Days Failure Of Congress: అడ్డగోలు హామీలు.. గ్యారంటీల పేరు చెప్పి మోసం చేస్తూ వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ భారీ ఆందోళనకు సిద్ధమైంది. వారం రోజుల పాటు భారీ ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jagadish Reddy Demands Revanth Reddy Must Apologize ToKCR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం వెంటనే రైతులకు సాగునీరు అందించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా నీళ్లు తన్నుకుపోతుందని మండిపడ్డారు.
Former Minister Anil Kumar Yadav And BRS Former MLA Korukanti Chander At Tirumala Temple Watch Visuals
Preethi Reddy Offers Varalakshmi Vratam: శ్రావణమాసంలో వచ్చిన రెండో శుక్రవారానికి తెలుగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతం చేశారు. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా వరలక్ష్మీ వ్రతం చేశారు. ఈ సందర్భంగా మంగళహారతి పాట పాడుతూ ప్రీతిరెడ్డి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.చఆ వీడయో చూసేయండి.
Election Commission Released Telangana SIR Draft: తెలంగాణలో ఓటర్ జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2.64 కోట్ల మంది ఓటర్లు ఫామ్‌లు నింపారని.. 9.22 లక్షల మంది ఓటర్లు మృతి చెందారని ఎన్నికల సంఘం వెల్లడించింది. నిజమైన ఓటర్లు ఉంటే వారికి చివరి అవకాశం కల్పిస్తున్నట్లు ఈసీ తెలిపింది.