IND vs SL Pink Ball Test Playing 11, Jayant Yadav out and Axar Patel in: రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్పిన్నర్ జయంత్ యాదవ్ స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. దాంతో ముగ్గురు స్పిన్నర్లతో రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. మరోవైపు లంక రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. పాతుమ్ నిస్సాంక, లహిరు కుమార స్థానాల్లో కుశాల్ మెండిస్, ప్రవీణ్ జయవిక్రమ ఆడుతున్నారు.
రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'మేము మొదట బ్యాటింగ్ చేస్తాం. పిచ్ పొడిగా కనిపిస్తోంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. అక్షర్ పటేల్ ఫిట్‌గా ఉన్నాడు. జయంత్ యాదవ్ స్థానంలో అతడు ఆడుతున్నాడు. ఇది పొడి పిచ్. అక్షర్ తాను ఆడిన చివరి సిరీస్‌లో ఏమి చేసాడో చూశాము. కాబట్టి అతన్ని తిరిగి జట్టులోకి తీసుకున్నాం. కేవలం ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత జయంత్‌ను తప్పించాల్సి రావడం బాధాకరమే. కుర్రాళ్లకు తమను తాము నిరూపించుకోవడానికి తగినన్ని అవకాశాలు ఇస్తాం' అని అన్నాడు.
రెండు టెస్ట్ మ్యాచుల్ సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచులో కూడా గెలిచి మరో క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. రెండు జట్ల మధ్య రెండో టెస్టు అయిన ఇది డే-నైట్ మ్యాచ్. అంటే పింక్ బాల్‌తో మ్యాచ్ జరుగుతోంది. భారత జట్టుకు ఇది నాలుగో పింక్ బాల్ టెస్టు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ తొలిసారి తొలి పింక్ బాల్ టెస్టులో సారథ్యం వహించనున్నాడు. రోహిత్ 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ.
శ్రీలంక: దిముత్ కరుణరత్నె (కెప్టెన్), లహిరు తిరిమన్నె, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, నిరోషన్ డిక్వెల్లా (కీపర్), సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దెనియా, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్ జయవిక్రమ.
🚨 Team News 🚨
1⃣ change for #TeamIndia as Axar Patel is named in the team. #INDvSL | @Paytm
Follow the match ▶️ https://t.co/t74OLq7xoO
Here's our Playing XI for the pink-ball Test 🔽 pic.twitter.com/4ObSFoM7wU
— BCCI (@BCCI) March 12, 2022
Also Read: PF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు ఊహించని షాక్.. వడ్డీ రేట్లను తగ్గించిన ఈపీఎఫ్ఓ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook