ధోనీ ధనా ధన్; టీమిండియా బంపర్ విక్టరీ ; సిరీస్ భారత్ కైవసం

India Vs Asurtalia 3rd ODI: ఆసీస్ గడ్డపై కోహ్లీ సేన తిరుగులేని ఆధిపత్యం సాధించింది. అటు టెస్టు సిరీస్ - ఇటు వన్డే సిరీస్ గెల్చుకొని సరికొత్త రికార్డు సృష్టించింది.

Last Updated : Jan 18, 2019, 07:06 PM IST
ధోనీ ధనా ధన్; టీమిండియా బంపర్ విక్టరీ ; సిరీస్ భారత్ కైవసం

మెల్ బోర్న్ వేదికగా జరిగిన చిట్టచివరి మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ధోనీ విజృంభణతో ఆసీస్ పై కోహ్లీసేన ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 49.2 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ధోనీ 83 పరుగులో రాణించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక మిగిలిన బ్యాట్స్ మెన్ల విషయానికి వస్తే  ఓపెనర్లు రోహిత్ శర్మ 9 , శిఖర్ ధావన్ 23 పరుగులు చేసి ఔట్ అయ్యారు. అనంతరం బరిలోకి దిగిన కెప్టెన్ కోహ్లీ 46 పరుగులతో రాణించాడు.యువ ఆటగాడు కేదార్ జాదవ్ 61 సెంచరీ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు . ఫలితంగా టీమిండియా 49.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో సిరీస్ 2- 1 తేడాతో కైవసం చేసుకున్నట్లయింది. ఇప్పటికే టెస్టు సిరీస్ గెల్చుకున్న టీమిండియా ..వన్డే సిరీస్ ను కైవసం చేసుకొని ఆసీస్ గడ్డపై చరిత్ర సరికొత్త రికార్డు సృష్టించింది.

Trending News