RCB vs GT: బెంగళూరులో భారీ వర్షం.. టాస్ ఆలస్యం! ఆర్‌సీబీ ఆశలపై నీళ్లు

RCB vs GT Toss delayed due to wet outfield. బెంగళూరులో మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వర్షం తగ్గినా ప్రస్తుతం చిరు జల్లులు పడుతున్నాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : May 21, 2023, 08:44 PM IST
RCB vs GT: బెంగళూరులో భారీ వర్షం.. టాస్ ఆలస్యం! ఆర్‌సీబీ ఆశలపై నీళ్లు

RCB vs GT Toss delayed due to wet outfield: ఐపీఎల్‌ 2023లో చివరి లీగ్‌ మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆడనున్నాయి. మరికొద్దిసేపట్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే బెంగళూరులో మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో మ్యాచ్‌ ఆలస్యం అయింది. వర్షం తగ్గినా చిరు జల్లులు పడడంతో మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. 

ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చాలా కీలకం. గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కుకు చేరుతుంది. ఈ మ్యాచ్‌ సజావుగా జరిగితే గుజరాత్‌పై బెంగళూరు విజయం సాధించాలి. అప్పుడు 16 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. బెంగళూరు ఫాన్స్ తమ జట్టు గెలవాలని కోరుకుంటున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 

తుది జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్ (కెప్టెన్), బ్రాస్‌వెల్, మ్యాక్స్‌వెల్, మహిపాల్ లామ్రోర్, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్, హర్షల్ పటేల్, పార్నెల్, సిరాజ్‌, విజయ్‌కుమార్ వైశాఖ్‌. 
గుజరాత్ టైటాన్స్‌: శుభ్‌మన్‌ గిల్, వృద్ధిమాన్‌ సాహా, హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్‌, డాసున్ శనక, రాహుల్ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, మోహిత్ శర్మ, నూర్‌ అహ్మద్‌, మహ్మద్‌ షమి, యశ్ దయాల్. 

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు:
గుజరాత్: విజయ్ శంకర్, కేఎస్ భరత్, శివమ్ మావి, అభినవ్ మనోహర్‌, సాయి కిశోర్ 
బెంగళూరు: హిమాన్షు శర్మ, ప్రభ్‌దేశాయ్‌, ఫిన్‌ అలెన్‌, సోను యాదవ్, ఆకాశ్‌ దీప్‌ 

Also Read: MI vs SRH: చెలరేగిన కామెరూన్ గ్రీన్‌.. సన్‌రైజర్స్‌పై ముంబై ఘన విజయం! ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం  

Also Read: AP Weather Updates: రేపు ఈ మండలాల్లో వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News