IND vs ZIM, KL Rahul answered critics with his bat: టీ20 ప్రపంచకప్ 2022లో మొన్నటివరకు టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. మెగా టోర్నీ ఆరంభంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా డబుల్ డిజిట్ అందుకోలేకపోయాడు. పాకిస్థాన్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాపై వరుసగా 4, 9, 9 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో రాహుల్ బ్యాటింగ్ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. రాహుల్ ఫ్లాఫ్ షో మిగతా బ్యాటర్లపై పడుతుందని చాలా మంది మాజీలు మండిపడ్డారు. ఫామ్‌లో లేని అతడిని జట్టు నుంచి తప్పించాలని కొందరు ఫాన్స్ కూడా డిమాండ్ చేశారు.
కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయినా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం అతడిపై నమ్మకం ఉంచాడు. రాహుల్ జట్టులో ఉండాలని, ఫామ్ అందుకుంటే అతడిని ఎవరూ ఆపలేరు అని మద్దతిచ్చాడు. రాహుల్ లేకుంటే.. జట్టు సమతుల్యత పోతుందని కూడా హెచ్చరించాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ తిరిగి లయను అందుకొన్నాడు. మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేశాడు. దాంతో టీమ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొన్నాడు. పరుగులు చేయడమే కాదు.. అద్భుతమైన త్రోతో కీలకమైన బంగ్లాదేశ్ బ్యాటర్‌ను ఔట్ చేశాడు. ఆ రనౌటే మ్యాచును మలుపు తిప్పింది. దాంతో రాహుల్ ఒక్కసారిగా హీరో అయ్యాడు.
నేడు జింబాబ్వేతో జరిగిన సూపర్-12 మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (15) నిరాశపరిచినప్పటికీ.. రాహుల్ (51) హాఫ్ సెంచరీతో మెరిశాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 51 రన్స్ బాదాడు. భారత్ 186 రన్స్ చేయడంలో రాహుల్ తనవంతు సహకారం అందించాడు. ఇన్ని రోజులు విమర్శించిన వారికి రాహుల్ తన బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు. రెండే రెండు ఇన్నింగ్స్‌లతో విమర్శకుల నోళ్లు మూయించాడు. తాను ఎంత కీలక ప్లేయరో మరోసారి నిరూపించుకున్నాడు. మొన్నటి వరకు తిట్టిన ఫాన్స్, నెటిజన్లు.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
జింబాబ్వేతో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని గ్రూప్ 2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్లో గ్రూప్ 1లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌తో భారత్ అమితుమీ తేల్చుకోనుంది. మరొ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ ఆడనుంది. అన్ని కుదిరితే.. భారత్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: సూర్యకుమార్ యాదవ్.. ఇట్స్ ఏ బ్రాండ్! దెబ్బకు రికార్డులు అన్ని బద్దలయ్యాయిగా
Also Read: 2007 తర్వాత ఇదే మొదటిసారి.. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్, పాకిస్తాన్ మధ్య మరో మ్యాచ్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి