German open 2022: జర్మన్ ఓపెన్ 2022 (German Open 2022) పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌లో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ నం. 1, ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్‌సెన్‌కు (viktor axelsen) షాకిచ్చాడు భారత క్రీడాకారుడు లక్ష్యసేన్. 3 గేమ్‌లలో ఓడించి.. ఫైనల్ కు చేరుకున్నాడు లక్ష్యసేన్. ఆదివారం జరగనున్న ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ విటిడ్‌సర్న్‌ను ఎదుర్కొన్నాడు. గంటకు పైగా సాగిన సెమీఫైనల్‌లో లక్ష్య సేన్ 21-13, 12-21, 22-20తో విక్టర్ అక్సెల్‌సెన్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. ఇంతకముందూ వీరిద్దరూ నాలుగు సార్లు తలపడగా.. అన్నిసార్లు విక్టరే పైచేయి సాధించాడు.
𝙀𝙉𝘿𝙂𝘼𝙈𝙀 🏆⚔️
After an emphatic victory last night @lakshya_sen will fight it out for the #GermanOpen2022 title against 🇹🇭's K. Vitidsarn in the MS finals at Muelheim an der Ruhr, Germany 🇩🇪!👊💥
All the best champ! 🤜🤛#IndiaontheRise#Badminton pic.twitter.com/D6IJ8Vpy8g
— BAI Media (@BAI_Media) March 13, 2022
ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్...ఈ ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్‌లో (India Open) తన తొలి సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ 2022 సీజన్‌లో తన 2వ టైటిల్‌ను గెలుచుకునే అవకాశం వచ్చింది. విటిడ్‌సర్న్‌పై సేన్ 3-3 హెడ్-టు-హెడ్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు, గత సంవత్సరం హైలో ఓపెన్‌లో ఇతడిపై గెలుపొందాడు లక్ష్యసేన్. 2018లో జరిగిన ఆసియన్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సేన్ విటిడ్‌సర్న్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు.
Also Read: German Open 2022: క్వార్టర్ ఫైనల్‌కు శ్రీకాంత్.. ఇంటిదారి పట్టిన సింధు, సైనా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
German Open 2022: జర్మన్ ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్..