లండన్: ఆదివారం నాడు జరగనున్న ఐసిసి ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ స్టేడియంపై నుంచి రెండు రోజుల పాటు విమానాల రాకపోకలు సాగించడానికి వీల్లేదని ఐసిసి ప్రకటించింది. తాము చేసిన విజ్ఞప్తి మేరకు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ను సంబంధిత అధికార యంత్రాంగం నో ఫ్లెజోన్గా ప్రకటించినట్టుగా ఐసీసీ స్పష్టంచేసింది. ఇటీవల ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరుగుతుండగా వివాదాస్పద సందేశాలతో కూడిన బ్యానర్లను వేళ్లాడదీస్తూ ఛార్టెడ్ ఫ్లైట్స్ స్టేడియంపై చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
అయితే, స్టేడియంలో క్రికెట్ ప్రముఖులు, నిపుణులు, వీక్షకుల భద్రతకు సవాల్ విసిరిన ఈ ఘటన భారత్ సహా పలు దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ బీసీసీఐ సైతం ఐసిసికి ఫిర్యాదు చేసింది. దీంతో ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ముందస్తుగానే చర్యలు చేపట్టిన ఐసిసి.. ఫైనల్ మ్యాచ్ జరిగే ఆదివారం 14వ తేదీతోపాటు రిజర్వ్‌డే సోమవారం 15వ తేదీని కూడా నోఫ్లై జోన్‌గా ప్రకటించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు ఐసీసీ వెల్లడించింది.