మాకు రహానే వద్దు.. స్మిత్ కావాలి: ఆర్ఆర్ అభిమానులు

బాల్ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో  ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌కు అనూహ్యంగా రాజస్థాన్‌ రాయల్స్‌ అభిమానులు అండగా నిలుస్తున్నారు.

Last Updated : Mar 27, 2018, 02:02 PM IST
మాకు రహానే వద్దు.. స్మిత్ కావాలి: ఆర్ఆర్ అభిమానులు

బాల్ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో  ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌కు అనూహ్యంగా రాజస్థాన్‌ రాయల్స్‌ అభిమానులు అండగా నిలుస్తున్నారు. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా స్మిత్‌ను తొలగించడంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా..సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి టీమిండియా క్రికెటర్‌ అజింక్యా రహానేను నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకంపై కూడా అభిమానులు మండిపడుతున్నారు.

రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించడంపైనా వారు ప్రశ్నిస్తున్నారు. రహానే నాయకత్వంలో టైటిల్ సాధించడం కష్టమని, స్మిత్ తన తప్పును అంగీకరించాడు. కాబట్టి ఐపీఎల్‌లో అతడికే కెప్టెన్సీ కట్టబెట్టాలని కోరుతున్నారు. స్మిత్‌ లోటు ఎవరు భర్తీ చేయలేరని, రహానే కెప్టెన్‌ అనేది రాజస్తాన్‌ అభిమానులకు ఓ చేదు వార్త అని విమర్శిస్తున్నారు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆశీష్‌ నెహ్రా సైతం స్మిత్, వార్నర్‌లకు మద్దతుగా పలికారు.

 

 

 

 

Trending News