చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తీరుపై రోహిత్ శర్మ అసంతృప్తి, ఎంపైర్‌కి ఫిర్యాదు

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తీరుపై రోహిత్ శర్మ అసంతృప్తి 

Last Updated : May 13, 2019, 02:05 PM IST
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తీరుపై రోహిత్ శర్మ అసంతృప్తి, ఎంపైర్‌కి ఫిర్యాదు

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఫైనల్ ఐపిఎల్ మ్యాచ్‌లో స్వల్ప వివాదం క్రీడావర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన క్వింటన్ డికాక్‌ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, డికాక్‌ను ఔట్ చేసిన అనంతరం శార్దూల్ ఠాకూర్ వ్యవహరించిన తీరే ఇప్పుడు వివాదాస్పదం అయింది. తన బౌలింగ్‌లోనే సిక్స్ కొడతావా అన్నట్టుగా డికాక్‌ వైపు వేలు చూపిస్తూ శార్థుల్ ఠాకూర్ ప్రదర్శించిన హావభావాలు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కంట్లో పడకపోలేదు. నాన్ స్ట్రైయింకింగ్ ఎండ్‌లో ఉండి శార్ధుల్ ఠాకూర్ ప్రవర్తించిన తీరును స్పష్టంగా గమనించిన రోహిత్ శర్మ వెంటనే ఈ విషయాన్ని మ్యాచ్ అంపైర్‌ ఇయాన్ గౌల్డ్‌కి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత అంపైర్ వెళ్లి ఠాకూర్‌తో మాట్లాడటం వెనువెంటనే జరిగిపోయాయి. 

ప్రస్తుతానికి సద్దమణిగినట్టుగానే కనిపించిన ఈ వివాదం తర్వాత ఏ మలుపు తిరుగుతుందోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Trending News