అంధుల క్రికెట్‌కు వారు చేసే సేవ అపారం..!

సమర్థనం ట్రస్టు.. ఈ సంస్థ అంధులలో ఉండే విశేషమైన నైపుణ్యాలను బయటకు తీసి వారిని ఆ దిశగా ప్రోత్సహించే ఓ స్వచ్ఛంద సంస్థ. "క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా" అనే సంస్థకు ఈ ట్రస్టు ప్యాట్రన్‌గా కూడా వ్యవహరిస్తోంది

Last Updated : Dec 3, 2017, 07:45 PM IST
అంధుల క్రికెట్‌కు వారు చేసే సేవ అపారం..!

సమర్థనం ట్రస్టు.. ఈ సంస్థ అంధులలో ఉండే విశేషమైన నైపుణ్యాలను బయటకు తీసి వారిని ఆ దిశగా ప్రోత్సహించే ఓ స్వచ్ఛంద సంస్థ. "క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా" అనే సంస్థకు ఈ ట్రస్టు ప్యాట్రన్‌గా కూడా వ్యవహరిస్తోంది. తన బాధ్యతల్లో భాగంగా ఇప్పటి వరకు దేశంలో ఎందరో ప్రతిభావంతులైన అంధ క్రికెటర్లకు శిక్షణ అందించి.. వారిని వివిధ అంతర్జాతీయ పోటీలకు పంపే విషయంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది. భారత అంధ క్రికెటర్ల జట్టు మాజీ కెప్టెన్ శేఖర్ నాయక్ కూడా ఈ ట్రస్టు సహాయంతోటే మంచి క్రీడాకారుడిగా ఎదిగాడు.

సమర్థనం ట్రస్టుకి సంబంధించిన 19 సెంటర్లు ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తున్నాయి. ఈ ట్రస్టు సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఇటీవలే "దివ్యాంగ్జన్" పురస్కారాన్ని అందించింది. వికలాంగుల నైపుణ్యాలను గుర్తించి.. వారికి చేయూతనిచ్చే సంస్థలకు భారత ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారమే "దివ్యాంగ్జన్". ఇటీవలే ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ మహంతేష్ జీ కివదసనవర్ ఈ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. 

Trending News