IND Vs WI 2nd Test: గత మ్యాచ్ రికార్డుపై భారత్ గురి.. అంతటి భారీ విజయం సాధ్యమేనా ?

ఒకవైపు విండీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తున్న కోహ్లీసేన .. మరోవైపు భారీ విజయంపై గురిపెట్టింది.

Last Updated : Sep 2, 2019, 07:40 PM IST
IND Vs WI 2nd Test: గత మ్యాచ్ రికార్డుపై భారత్ గురి.. అంతటి భారీ విజయం సాధ్యమేనా ?

విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీసేన గత మ్యాచ్ కంటే భారీ తేడాతో విజయం (318 రన్స్ ) సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ప్రస్తుత ఆట పరిస్థితిని గమనించినట్లయితే.. తొలి ఇన్నింగ్ లో 416 పరుగులు చేసిన కోహ్లీసేన విండీస్ 117 పరుగులకే ఆలౌట్ చేయడం.. ఫాలో అన్ ఇవ్వకుండా బ్యాటింగ్ కు దిగిన కోహ్లీసేన రెండో ఇన్నింగ్ 168 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసి విండీస్ ముందుకు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు ప్రస్తుతం  రెండు కీలక వికెట్లు కోల్పోయి 45 పరుగులు మాత్రమే చేసింది. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు మాత్రమే ఉన్నాయి. పైగా రెండు రోజుల ఆట మిగిలింది. ఇరు జట్ల బలం, ప్రస్తుత ఫాంను అంచానా వేసి చూస్తే ఈ లక్ష్యాన్ని సాధించడం విండీస్ కు దాదాపు అసాధ్యమే... అలాగని రెండో రోజుల పాటు ఆటను సాగదీసి డ్రా చేసుకునే సామర్థ్యం ఆ జట్టుకు లేదు. అయితే ఎంతా తేడాతో ఓడిపోతుందనేదే ఇక్కడ ప్రశ్న అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇలాంటి పరిస్థితిలో గత మ్యాచ్ లో సాధించిన రికార్డును తిరగరాయాలని కోహ్లీ సేన భావిస్తోంది. విండీస్ మాత్రం సాధ్యమైనంత ఎవ్కవ పరుగులు జోడించి ఘోర పరాజయం నుంచి గట్టెక్కితే చాలు అనే ధీన స్థితిలో ఆడుతోంది. 468 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు మొత్తం 13.2 ఓవర్లు ఎదుర్కొని కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసి ఎదరీదుతోంది. విజయం సాధించాలంటే ఇంకా 423 పరుగుల సాధించాల్సి ఉంది. ఇదిలా ఉండగా విండీస్ జట్టును కోహ్లీసేన 150లోపు ఆలౌట్ చేసినట్లయితే  గత మ్యాచ్ ను రికార్డు  (318 రన్స్ )ను తిరగ రాసినట్లవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇరుజట్ల ప్రదర్శనపై ఉత్కంఠత నెలకొంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ రోజు జరిగే మ్యాచ్ చూడాల్సిందే మరి.
 

Trending News