కరేబియన్ జట్టుకు మరో అవమానం ఎదురైంది. ప్రపంచకప్లో నేరుగా అర్హత దక్కని దుస్థితి ఏర్పడింది. బోర్డులో విభేదాలు, జీతాల గొడవలు, సఖ్యత లేని ఆటగాళ్లతో నానాటికి తీసికట్టుగా మారుతున్న కరేబియన్ జట్టు ఇక పసికూన జట్లతో కలిసి అర్హత టోర్నీ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేరుగా అర్హత సాధించే జట్లలో ఆఖరి బెర్త్ కోసం శ్రీలంక, విండీస్ పోటీ పడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో విండిస్ 5 -0 తేడాతో గెలిస్తేనే ప్రపంచకప్ అర్హత సాధించే అవకాశమున్న తరుణంలో ..తొలి వన్డేలో ఓటమిపాలవడంతో విండిస్ ఆశయలు గల్లంతయ్యాయి. విండీస్ 76 పాయింట్లతో శ్రీలంక (86 పాయింట్ల) తర్వాతి స్థానంలో నిలిచింది. దీంతో శ్రీలంక ఆఖరి బెర్త్ ఖరారు చేసుకుంది. ఒక్కప్పుడు క్రికెట్ ప్రపంచాన్నిశాసించిన విండీస్ జట్టు పరిస్థితి ఇంత దారుణంగా తయారవడం గమనార్హం.