T20 World Cup 2022 Super 12 Group 1 and Group 2 Teams List: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో జింబాబ్వే అడుగుపెట్టింది. గ్రూఫ్-బిలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 రన్స్ చేసింది. జింబాబ్వే విజయంలో క్రెయిగ్ ఇర్విన్ (58; 54 బంతుల్లో 6 ఫోర్లు), సికందర్ రజా (40; 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) కీలక పాత్ర పోషించారు. ఈ ఓటమితో స్కాట్లాండ్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మున్సీ (54; 51 బంతుల్లో 7 ఫోర్లు) టాప్ స్కోరర్. మెక్ లియోడ్ (25), బెరింగ్టన్ (13), లీస్క్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. జింబాబ్వే బౌలర్లలో చతరా, నగర్వాలు తలా రెండు వికెట్లు తీశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం.
స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రెగిస్ చకబ్వా (4).. స్టార్ బ్యాటర్లు వెస్లీ మాధేవేరే (0), సీన్ విలియమ్స్ (7) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో క్రెయిగ్ ఇర్విన్, సికందర్ రజా జట్టును ఆదుకున్నారు. వీరి అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మిల్టన్ షుంబా (11), రియాన్ బర్ల్ (9) జట్టును గెలిపించారు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ 2 వికెట్లు తీశాడు.
Zimbabwe are through to the Super 12 after a fabulous performance in Hobart 👏🏻
The first time they have made it out of the First Round at the #T20WorldCup 🔥#SCOvZIM pic.twitter.com/W1snTvtwch
— ICC (@ICC) October 21, 2022
ఈ విజయంతో జింబాబ్వే గ్రూఫ్ బి టాపర్‌గా సూపర్-12లో గ్రూఫ్ 2లోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్‌పై విజయం సాధించిన ఐర్లాండ్ బి2గా గ్రూఫ్ 1లోకి అడుగుపెట్టింది. సూపర్ 12 గ్రూఫ్ 1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లుఉండగా.. గ్రూఫ్ 2లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, జింబాబ్వే టీమ్స్ ఉన్నాయి. సూపర్ 12 శనివారం ఆరంభం కానుంది.
Also Read: మనిషి అంత్యక్రియలకు హాజరై.. ముద్దు పెట్టి నివాళులర్పించిన కొండముచ్చు! గుండెలు పిండేసే దృశ్యం
Also Read: Actress Anjali Pavan : స్టేజ్ మీద ఏడిపించేసిన మొగలిరేకులు అంజలి పవన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook